Lakshmi Padmavathi Sametha Venkateswara - Journalistfile Telugu News

ఇల వైకుంఠపురంలో.... 15,నుండి వార్షిక బ్రంహ్మోత్సవములు
తెనాలి (జర్నలిస్ట్ ఫైల్) : డెల్టా ప్రాంతంలో ద్వితీయ తిరుపతిగా భాసిల్లుతున్న వైకుంఠపురం, ఆంధ్రాప్యారీస్ గా అలరారుతున్న తెనాలిలో మహా మహిమాన్విత వైష్ణవధామం, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు. ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు,  ఆలయ సహాయ కమిషనర్  మంతెన అనుపమ పర్యవేక్షణలో, అన్నివిధాలుగా సన్నాహాలు చేస్తున్నారు. కలియుగంలో సంకటహరణ మూర్తిగా, మొక్కులను స్వీకరించే ఆపదమొక్కుల వాడిగా , అనునిత్యం పూజలు అందుకునే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం వైకుంఠపురం ఆవిర్భావం నుండి ఇప్పటివరకు ఎంతోమంది వధాన్యాలు తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాము లయ్యారు. 1972లో తుళ్లూరు బాల నరసింహారావు గౌడ్ సంకల్పంతో, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం రూపుదిద్దుకుంది.నాటి నుండి  కలియుగ వరదైవమై, భక్తుల అభీష్టాలు నెరవేర్చు తున్న స్వామివారికి, ఆలయ ఆవిర్భావం నుండి సుధీర్గకాలం, గంజాం రేణుక వెంకట లక్ష్మి నరశింహాచార్యులు ప్రధాన అర్చకులు తమ విధులను, భక్తుడికీ, భగవంతుడికీ వారధి వలే నిర్వహిస్తూ, పెద్దాచార్యులుగా సుపరిచితులనే
చెప్పాలి.భక్తుల రధ్ధీ నేపధ్యంలొ, దేవాదాయశాఖ వారి పర్యవేక్షణలో, స్వామి వారి ఆధ్యాత్మిక సేవలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఆలయధర్మకర్తల మండలి, సహాయ కమీషనర్ ల, సమన్వయం వైకుంఠపురం దిన దినాభివృధ్ధి కి దోహదపడింది. ప్రతి అంశంలో ఆధునికతకు అవకాశాలు మెండుగా ఉన్న. వైకుంఠపురం ఆలయ అభివృధ్ధి వినూత్నమనే చెప్పాలి. ఎమ్ తిమ్మానాయుడు ఆలయ సహాయ కమీషనర్ గా, విధులు నిర్వహించిన సమయంలొ ఆలయ గర్భగుడి, విమాన గోపురం, పూర్తి స్ధాయిలొ, కొండ రాళ్లను తెప్పించి, శిలలను శిల్పాలుగా మలచే, కళాకారుల, కళానైపుణ్యతొ, మలచిన కొండరాళ్ళతొ నిర్మాణం చేయడంతొ ఆలయ పవిత్రతకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అభివృద్ది పనుల సమయంలొ, విమర్శలు వచ్చినా, తనదైన విధానంతొ తిమ్మానాయుడు అభివృద్ది పనులు చేశారు. ఆతరువాత వచ్చిన, సహాయకమీషనర్ ఎమ్. అనుపమ విధి నిర్వాహణలొ, సమయ పాలన పాటించే అధికారిగా ఆలయ ప్రతిష్టను పెంచే విధంగా సేవలు అందిస్తున్నారనేది భక్తుల అభిప్రాయం.
నిబంధనలకు లోబడి విధులు నిర్వహించే అధికారులకు విమర్శలు సహజమే. కాయలున్న చెట్టుకు, రాళ్ళదెబ్బలు అన్నతీరుగ. బాధ్యత నిర్వాహణలొ నిబంధనలు పాటిస్తు, విధినిర్వాహణలొ సమయ పాలను ప్రాధాన్య ఇస్తున్న సహాయకమీషనర్ అనుపమ కార్యనిర్వాహలొ, ఈనెల 15 నుండి 21వ, తేదీవరకు నిర్వహించే వార్షిక బ్రంహోత్సవాలలొ, తొలిరోజైన గురువారం స్వామివారిని పెండ్లి కుమారుని చేయుట, అంకురారోపణ, ద్వజారోహణ,శుక్రవారం, నిత్యహోమములు, శేషవాహనసేవ గ్రామోత్సవం, శనివారం గజవాహన సేవ, గ్రామోత్సవం, ఆదివారం నిత్యహోమములు, ఎదురుకోల ఉత్సవం, రాత్రి 7,గంటలకు స్వామివారి కల్యాణం ఉత్సవం, సోమవారం నిత్యహోమములు, గరుడవాహన గ్రామోత్సవం, సాయంత్రం దివ్యరధోత్సవం, మంగళవారం వసంతోత్సవం, శ్రీచక్రస్నానం, ద్వజావరోహణము, పూర్ణాహుతి, బుధవారం వార్షిక బ్రంహోత్సవాలు ముగింపుగా ద్వాదశ ప్రదక్షణలు, ఏకాంతసేవ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రతి రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉత్సవాలలో ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి.బ్రంహాండ నాయకునికి నిర్వహించే బ్రంహ్మోత్సవాలను తిలకించి, భక్తిమీర శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించే భాగ్యం భక్తి ముక్తిదాయకం, మోక్షప్రదాయకం.