క్యాన్సర్ కు మనో ధైర్యమే మందు

క్యాన్సర్ కు మనో ధైర్యమే మందు

-సిజిహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. సిహెచ్. కోటేశ్వరరావు

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భూతం క్యాన్సరే నని, ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని సిజిహెచ్ఎస్ ( సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం ) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి. సిహెచ్. కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వస్ట్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుంటూరు నగరంపాలెంలోని సిజిహెచ్ఎస్ వెల్ నెస్ కేంద్రంలో ' ఒమేగా హాస్పిటల్ ' వారి సౌజన్యంతొ క్యాన్సర్ పై మహిళలకు అవగాహనా మరియు ఉచిత పరీక్షలు నిర్వహించారు. ప్రారంభోత్సవ సభలో డాక్టర్ టి.సిహెచ్. కోటేశ్వరరావు మాట్లాడుతూ..ఆధునిక జీవన శైలి, క్రమరహిత ఆహరపు అలవాట్లు, జంక్ ఫుడ్ వినియోగం, కాలుష్యంతొ క్యాన్సర్ కేసులు విజ్రంభిస్తున్నాయన్నారు. చిన్న పెద్ద, పేద ధనిక, పల్లెలు, పట్నాలు అనే తేడా లేకుండా క్యాన్సర్ సునామి ప్రమాద ఘంటికలు మొగిస్తుందన్నారు. క్యాన్సర్ భయం రోగి మనసును, శరీరాన్ని, ఆత్మను దెబ్బ తీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధి సోకిన వారికి జీవితం మీద ఆశలు కల్పిస్తూ, వ్యాధి గ్రస్తుల్లో మనో ధైర్యం నింపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ముఖ్యంగా రోగులకు ఆత్మ నిర్భరత, ఆత్మ స్థైర్యం అందించాలన్నారు. వ్యాధి నివారణ చికిత్సపై అవగాహన పెంచాలన్నారు. కుటుంబం, సమాజం, వైద్యులు క్యాన్సర్ రోగులకు ప్రతి దశ లో జయిస్తాను అనే మనో నిబ్బరం కలిగించాలన్నారు. సరైన కౌన్సిలింగ్ తొ, రోగి మనసు, శరీరం, ఆత్మ కోలుకునే సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. క్యాన్సర్ పట్ల భయాన్ని తొలగించినప్పుడే, రోగి త్వరగా కోలుకోగలడని కోటేశ్వరరావు తెలిపారు.

ఒమేగా హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి. గీతా రుక్మిణి మాట్లాడుతూ.. ప్రతి మహిళ ఎడాదికొకసారి రొమ్ము, గర్బాశయ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. క్యాన్సర్ ముప్పును ముందుగానే గుర్తిస్తే, నివారణ అతి సులభమన్నారు. ముదిరిన క్యాన్సర్ కణితిని తుదముట్టించేందుకు రకరకాల అస్త్రశస్త్రాలతో సంసిద్దమై ఉన్నామన్నారు. ఉచిత క్యాన్సర్ శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 54 మంది మహిళలకు బ్రెస్ట్, పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించి, క్యాన్సర్ పై అవగాహనా కల్పించారు. మహిళలకు క్యాన్సర్ టెస్ట్లునిర్వహించిన ఒమేగా హాస్పిటల్ టీమ్ కు సిజిహెచ్ఎస్ డాక్టర్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ నర్సింగ్ ఆఫీసర్ హేమా సుందరి, ఫార్మాసిస్టులు అయేషా, సునీల్ సిబ్బంది కె. మురళీ కృష్ణ, రామారావు, మోహన్, వెంకటేశ్వర్లు, మక్బుల్,రత్నరాజు ఒమేగా డాక్టర్లు ఎన్. శుభశ్రీ, వంశీ కృష్ణ మేనేజర్ కె. బాపు రెడ్డి నర్సింగ్ స్టాఫ్ గీతా, దివ్య, దుర్గా భవాని, అలేఖ్య, శేష సాయి పాల్గొన్నారు.

About The Author

Latest News