హృతిక్‌ రోషన్‌కు గాయాలు

హృతిక్‌ రోషన్‌కు గాయాలు

హృతిక్‌ రోషన్‌కు గాయాలు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృత్రిక్‌ రోషన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా ఆయన నడుముకు బెల్ట్‌ పెట్టుకుని, క్రచెస్‌ సాయంతో నిలుచున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. గతంలో మీలో…

హృతిక్‌ రోషన్‌కు గాయాలు

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృత్రిక్‌ రోషన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా ఆయన నడుముకు బెల్ట్‌ పెట్టుకుని, క్రచెస్‌ సాయంతో నిలుచున్న ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. గతంలో మీలో ఎంతమందికి ఈ క్రచెస్‌, వీల్‌చైర్‌ అవసరమొచ్చింది? ఆ సమయంలో మీరెలా ఫీలయ్యారు అంటూ ప్రశ్నించారు. అయితే తనకు ఎందుకు గాయాలయ్యాయో హృతిక్‌ తన పోస్టులో వివరించలేదు. ప్రస్తుతం ఆయన తనకు తగిలిన గాయం నుంచి కోలుకుంటున్నానని హృతిక్‌ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌ అయింది. దీంతో వరుణ్‌ధావన్‌, టైగర్‌ ష్రాఫ్‌ వంటి పలువురు నటులు హృతిక్‌ త్వరగా కోలుకోవాలని మెసేజ్‌లు పంపుతున్నారు.

హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి ‘వార్‌ 2’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అయితే హృత్రిక్‌ కాలికి గాయమవ్వడం వల్ల ఈ సినిమా షూటింగ్‌ వాయిదాపడింది. బహుశా ఈ ప్రాజెక్టు మరింత ఆలస్యం కావొచ్చని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ఈ ఏడాది జనవరి 25న హృతిక్‌ ‘ఫైటర్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టింది. ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు.

Tags:

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?