రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్‌ అశ్విన్‌

రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్‌ అశ్విన్‌

రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్‌ అశ్విన్‌ టీమిండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రాజ్‌ కోట్‌ లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలీ(15)ని అవుట్‌ చేయడం…

రికార్డు పుటల్లోకెక్కిన రవిచంద్రన్‌ అశ్విన్‌

టీమిండియా సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. రాజ్‌ కోట్‌ లో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాక్‌ క్రాలీ(15)ని అవుట్‌ చేయడం ద్వారా అశ్విన్‌ 500 వికెట్ల క్లబ్‌ లో చేరాడు. లెగ్‌ స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే తర్వాత టెస్టుల్లో 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌ గా అశ్విన్‌ రికార్డు పుటల్లోకెక్కాడు. కుంబ్లే ఈ మైలురాయిని అందుకోవడానికి 105 టెస్టులు ఆడగా, అశ్విన్‌ 98 టెస్టుల్లోనే ఈ ఘనతను నమోదు చేయడం విశేషం. శ్రీలంక ఆఫ్‌ స్పిన్‌ లెజెండ్‌ ముత్తయ్య మురళీధరన్‌ కేవలం 87 టెస్టుల్లోనే 500 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

Tags:

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?