ఐపిఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

ఐపిఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

ఐపిఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది మార్చి 22నుంచి ఏప్రిల్‌ 7వరకు విడుదల 17రోజుల్లో 21 మ్యాచ్‌లుషెడ్యూల్‌ విడుదల చేసిన బిసిసిఐ ముంబయి : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 షెడ్యూల్‌ వచ్చేసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ఈ సీజన్‌ తొలి 17రోజుల షెడ్యూల్‌ను గురువారం…

ఐపిఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది

  • మార్చి 22నుంచి ఏప్రిల్‌ 7వరకు విడుదల
  • 17రోజుల్లో 21 మ్యాచ్‌లుషెడ్యూల్‌ విడుదల చేసిన బిసిసిఐ

ముంబయి : ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌) సీజన్‌-17 షెడ్యూల్‌ వచ్చేసింది. భారత క్రికెట్‌ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ఈ సీజన్‌ తొలి 17రోజుల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా 17రోజుల్లో మొత్తం 21మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 22న చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో చెన్నైాబెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో సీజన్‌-17 ఐపిఎల్‌ ప్రారంభం కానుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ అనంతరం ఐపిఎల్‌-17 సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ రానుంది. మార్చి 22నుంచి ఏప్రిల్‌ 7వ వరకు జరిగే మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపిఎల్‌ నిర్వాహకులు విడుదల చేశారు.

ఐపిఎల్‌కు షమీ దూరం

ఐపిఎల్‌ 17వ సీజన్‌ ప్రారంభానికి ముందు గుజరాత్‌ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ ఈ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఎడమ కాలి మడిమ గాయంతో బాధపడుతున్న షమీ.. ఇంకా కోలుకోలేదు. కాలిమడమకు చికిత్సకు జనవరిలో షమీ లండన్‌కు వెళ్లాడు. మూడు వారాల్లో కోలుకుంటాడని ఆశించినా.. దురదఅష్టవశాత్తూ ఇంకా కోలుకోలేదు. దాంతో, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే సర్జరీ కోసం షమీ మళ్లీ లండన్‌ వెళ్లనున్నాడు. అందువల్ల అతడు ఐపిఎల్‌కు దూరం కానున్నాడు అని బిసిసిఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

విశాఖలో రెండు మ్యాచ్‌లు..

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడే రెండు మ్యాచ్‌లు విశాఖలో జరగనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం అరుణ్‌ జైట్లీ స్టేడియంతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం స్టేడియాన్ని హోంగ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇందులో భాగంగా మార్చి 31న ఢిల్లీ-చెన్నై జట్ల మధ్య, 3న ఢిల్లీ-కోల్‌కతా జట్ల మ్యాచ్‌లు విశాఖలో జరగనున్నాయి. దీనికి కారణకారణం మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) రెండో అంచె పోటీలు ఐపిఎల్‌ జరిగే తేదీల్లో అక్కడ జరుగుతుండడమే. డబ్ల్యూపిఎల్‌లో తొలి అంచె పోటీలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 4 దాకా బెంగళూరులో జరిగితే ఆ తర్వాత టోర్నీ మొత్తం ఢిల్లీకి షిఫ్ట్‌ అవనుంది. లీగ్‌ దశతో పాటు ప్లాేఆఫ్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లూ (మొత్తం 12) అరుణ్‌ జైట్లీ స్టేడియంలోనే జరుగుతాయి. వరుసగా మ్యాచ్‌ల నిర్వహణ కారణంగా ఇక్కడ తక్కువ వ్యవధిలోనే మళ్లీ ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించడం వీలుకాదని ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (డిడిసిఎ) బిసిసిఐకి తెలిపింది. వరుస మ్యాచ్‌ల వల్ల పిచ్‌ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో డిడిసిఎ, బిసిసిఐలు ఐపిఎల్‌లో ఢిల్లీ ఆడబోయే మ్యాచ్‌లను వైజాగ్‌కు తరలించినట్టు సమాచారం.

ఐపిఎల్‌                 తొలి అంచె                     షెడ్యూల్‌…

మార్చి 22(శుక్ర)   చెన్నై × బెంగళూరు    రా.8.00గం||కు చెన్నై

23(శని)                 పంజాబ్‌ × ఢిల్లీ          మ.3.30గం||కు మొహాలీ

కోల్‌కతా × సన్‌రైజర్స్‌ రా.8.00గం||కు

కోల్‌కతా24(ఆది)  రాజస్థాన్‌ × లక్నో     రా.8.00గం||కు జైపూర్‌

గుజరాత్‌ × ముంబయి రా.8.00గం||కు అహ్మదాబాద్‌

25(సోమ)       బెంగళూరు × పంజాబ్‌          రా.8.00గం||కు బెంగళూరు

26(మంగళ)    చెన్నై × గుజరాత్‌              రా.8.00గం||కు చెన్నై

27(బుధ)      సన్‌రైజర్స్‌ × ముంబయి       రా.8.00గం||కు హైదరాబాద్‌

28(గురు)       రాజస్థాన్‌ × ఢిల్లీ               రా.8.00గం||కు జైపూర్‌

29(శుక్ర)       బెంగళూరు × కోల్‌కతా        రా.8.00గం||కు బెంగళూరు

30(శని)      లక్నో × పంజాబ్‌                 రా.8.00గం||కు లక్నో

31(ఆది)    గుజరాత్‌ × సన్‌రైజర్స్‌            మ.330గం||కు అహ్మదాబాద్‌

ఢిల్లీ × చెన్నై రా.8.00గం||కు విశాఖ

01(సోమ)  ముంబయి × రాజస్తాన్‌           రా.8.00గం||కు ముంబయి

02(మంగళ)  బెంగళూరు × లక్నో               రా.8.00గం||కు బెంగళూరు

03(బుధ)   ఢిల్లీ × కోల్‌కతా                         రా.8.00గం||కు విశాఖ

04(గురు) గుజరాత్‌ × పంజాబ్‌                  రా.8.00గం||కు అహ్మదాబాద్‌

05(శుక్ర)  సన్‌రైజర్స్‌ × చెన్నై                  రా.8.00గం||కు హైదరాబాద్‌

06(శని) రాజస్తాన్‌ × బెంగళూరు                     రా.8.00గం||కు జైపూర్‌

07(ఆది) ముంబయి × ఢిల్లీ                        మ.3.30గం||కు ముంబయి

గుజరాత్‌ × లక్నో రా.8.00గం||కు లక్నో

Tags:

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?