మనుషులందరూ సమానమని చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

 వినుకొండ రాజారావు

మనుషులందరూ సమానమని చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.

 గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) :  అసమానతలు వేళ్ళూనికొని పోయిన సమాజంలో మనుషులందరూ సమానమేనని చాటిచెప్పిన మార్గదర్శి, హక్కుల గొంతుక, భారత రాజ్యాంగ నిర్మాత, అసమానతలపై కలం పోటుతో సమానత్వాన్ని చాటిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన జన్మదిన సందర్భంగా నేడు గుంటూరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది అంబేద్కర్ గారు లేకపోతే ఈ సమాజంలో కొన్ని వర్గాలకు మనుగడ ఉండేదికాదని,ఆయన రచించిన లిఖిత రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శమైందని, 21వ శతాబ్దపు మేధావిగా సమాజం ఉన్నంతవరకు అంబేద్కర్ ముందు అంబేద్కర్ కు తర్వాత అనేటువంటిది సత్యం అని , రాజ్యాంగం ద్వారా భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహా జ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని,మానవ వికాసానికి, శాస్త్రీయ విజ్ఞానం కోసం పాటుపడి ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించి పాలకులను ఎన్నుకునే విధానాన్ని ప్రజలందరికీ కల్పించిన గొప్ప మహా నీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆశయాలు  ఆచరణీయమని ఆయన సమాజానికి మార్గదర్శకుడు అని, ఆయన చూపించి నా మార్గం లో యువత పయనించాలని, వినుకొండ రాజారావు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో కొయ్యలమూడి జయప్రకాష్, ఎనిబెర బ్రహ్మయ్య,వేమవరపు శివకుమార్,కె. అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?