కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు : కాలవ

కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు : కాలవ

కనేకల్లు ( జర్నలిస్ట్ ఫైల్ ),: మండల పరిధిలోని గంగలాపురం గ్రామంలో సోమవారం టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అనంతపురం పార్లమెంటు స్థానం ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల ప్రచారానికి ముందు ఆ గ్రామస్తులు డబ్బులతో హారతులతో కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళుతూ కుటుంబ ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి ప్రజలకు క్షుణ్ణంగా వ్యవహరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో రాయదుర్గం నియోజకవర్గం లోని ఎడారి నివారణకు గతంలో సుమారు 4వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తీసుకువచ్చి తీరుతామని అదేవిధంగా ఉంతకల్లు రిజర్వాయర్ పనులను ప్రారంభిస్తామని, ఆగిపోయిన హెచ్.ఎల్.సి ఆధునీకరణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం అనంతపురం పార్లమెంటు స్థానం అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి చోట ప్రజలందరూ చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని నమ్ముతూ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాలెప్ప, ఆనంద్ రాజ్, సుదర్శన్, ఆది, బాయినేని నవీన్, చాంద్ బాషా, రైస్ మిల్ చంద్ర, అనిల్, వెంకటేష్, చిన్న  ఫక్రుద్దీన్, మారంపల్లి ఈరప్ప, బి టి.రమేష్, జలంధర్, బ్రహ్మసముద్రం రామప్ప, హనకనహాల్ మల్లికార్జున, బిజెపి మరియు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?