తర్ఫీదుకు మంగళం !

తర్ఫీదుకు మంగళం !

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు చెందిన యువతులు పలు కారణాల రీత్యా మధ్యలోనే చదువు మానేస్తుంటారు. ఏ విధమైన ఉపాధి అవకాశాలు లేనందున ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారికి వివిధ వృత్తి విద్యల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పేలా గతంలో తోడ్పాటు అందించేవారు. అయితే గత కొంతకాలంగా అటువంటి శిక్షణలను అధికారులు అటకెక్కించేశారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ టెక్నికల్ కన్సల్టెన్సీ (అపిట్కో) ద్వారా గతంలో గ్రామీణ ప్రాంత యువతులకు వివిధ జిల్లాల పరిధిలోని డీఆర్డీఏ ద్వారా వృత్తివిద్యలో శిక్షణ ఇచ్చేవారు. కుట్లు, అల్లికలు తదితర కోర్సుల్లో తర్ఫీదు ఇవ్వడంతో పాటు ఆయా పరికరాల కొనుగోలుకు రూ.10 వేల రుణ సదుపాయం కల్పించేవారు. అటువంటి బృహత్తర కార్యక్రమానికి అధికారులు  ప్రభుత్వం మంగళం పలికారు.
 
 • అపిట్కోను అటకెక్కించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజనకు రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం వహిస్తూ గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో 18 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన వారిని ఎంపిక చేసి, బ్యాచ్ కు 30 మంది చొప్పున తర్ఫీదు ఇస్తున్నారు. బంగారం, వస్త్ర వ్యాపార దుకాణాలు వంటి వాటిలో యువతులకు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నట్లు చెప్పుకొంటున్నారు.
 
నిధుల విడుదలలో తీవ్ర జాప్యం 
 
వివిధ జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా యువతకు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొంటోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులను జత చేయాల్సి ఉంటుంది. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో శిక్షణ పొందే యువతకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం కష్టతరమవుతోంది. ఒక్కో బ్యాచ్ కు  శిక్షణ నిమిత్తం రూ.10 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ నిధులు సకాలంలో విడుదల కావడం లేదు. దీనిపై అధికారులు మాట్లాడుతూ..నిధుల విడుదల జాప్యమవుతున్నప్పటికీ శిక్షణ తరగతులకు హాజరయ్యే యువతులకు పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. 
 
ఇతర సంస్థల్లో ఇచ్చేవీ డీఆర్డీఏ ఖాతాలోనే.. 
 
ఇతర సంస్థల్లో యువతకు ఇచ్చే శిక్షణలను సైతం డీఆర్డీఏ ఖాతాలో నమోదు చేసుకుంటున్నారు. యూనియన్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు వివిధ రకాల వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. యువత ఎంపికలో డీఆర్డీఏ సిబ్బంది భాగస్వామ్యం వహిస్తుండటంతో వారి లెక్కలను కూడా కొన్ని జిల్లాలో డీఆర్డీఏ జాబితాలోకి ఎక్కిస్తున్నారు.
 
Tags:

About The Author

Advertisement

Latest News

జనం కోసం 130 సార్లు బటన్ నొక్కిన జగన్ జనం కోసం 130 సార్లు బటన్ నొక్కిన జగన్
జగన్ కోసం 2 సార్లు బటన్ నొక్కేందుకు సిద్ధమైన జనంపశ్చిమలో వైసీపీ జోరు ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి ప్రచార హోరుగుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ )...
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే
క్రీడా వికాసానికి మంగళం
మూత్రం ఎక్కడ పోయమంటారు  ?
పర్యాటకం..కళావిహీనం !
రెండో పంటకు నీరేది?
మార్కెట్ యార్డ్ రేకుల షెడ్డులో ఐటీఐ కాలేజ్