పోలీస్ సంక్షేమంపై డీజీపీ ప్రత్యేక దృష్టి - పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు

పోలీస్ సంక్షేమంపై డీజీపీ ప్రత్యేక దృష్టి - పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు

మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : డీజీపీతో ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘ సభ్యులు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ను గురువారం కలిసి పోలీస్ ఫోర్స్ సంక్షేమానికి డీజీపీ తీసుకుంటున్న చర్యలపై  కృతజ్ణతలు తెలిపారు.  ప్రధానంగా ప్రతి పోలీస్ ఆఫీసర్ ఆరోగ్య తనిఖీలకు సుమారు ఏడు కోట్లు మంజూరు చేయడం, గత ప్రభుత్వం ఆగిపోయిన గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పునరుద్ధరణ చేయించి పీసీ నుండి ఏఎస్ఐ వరకు ఇరవై ఐదు లక్షలు, ఎస్ఐ నుండి ఎస్పీ వరకు ముప్పై ఐదు లక్షలు, ఐపీఎస్ అధికారులకు నలభై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం, వివాహ, వైద్య రుణాల కోసం ప్రతినెల ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం, మెరిట్ స్కాలర్షిప్ కోసం నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు కేటాయించడం వంటి అంశాలు డీజీపీ నేతృత్వంలో చేపట్టబడ్డాయి.

పోలీస్ యూనిట్ ఆస్పత్రులలో మందుల సౌకర్యం కోసం మూడు కోట్లు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, మహానాడు, ప్రధాన మంత్రి కార్యక్రమాల్లో డైట్ చార్జెస్ కోసం ఐదు కోట్లు, తక్షణ మరణ సహాయ నిధి కింద లక్ష రూపాయలు, అదనపు కార్పస్ పండు కింద మూడు కోట్లు, గ్రేహౌండ్స్ బ్యారెక్స్ కోసం రెండు కోట్లు ఆరవై లక్షలు, మంగళగిరి ఆరవీ బెటాలియన్‌లో అమరవీరుల స్తూపం కోసం యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం వంటి సంక్షిప్త చర్యలు కూడా అమలు చేశారు.

అంతేకాక, పీసీ నుండి ఏఎస్ఐ వరకు అంత్యక్రియల ఖర్చులు, బందోబస్తు కార్యక్రమాల్లో వసతి, భోజన సౌకర్యాలను సంబంధిత యూనిట్ అధికారులకు సర్కులర్ ద్వారా అందించడం, సివిల్ పీసీ నుండి హెచ్‌సీ పీటీపీలో అడ్డంకులను తొలగించడం వంటి అంశాలను కూడా డీజీపీ చర్చించారు.

ఈ సమావేశంలో పోలీస్ అధికారుల సంఘం డీజీపీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇంతకాలంలో మంచి డీజీపీని అందించిన నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ ఫోర్స్ సంక్షేమం కోసం తీసుకున్న ఈ చర్యలు ఉత్సాహకరమని అధికారులు పేర్కొన్నారు.

About The Author

Latest News