బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్

బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్.. రఘునందన్

 

బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గులాబీ పార్టీపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ అని ఎద్దేవా చేశారు. రంజిత్ రెడ్డి నుంచి కడియం కావ్య వరకు బీఆర్ఎస్ ను వీడి వెళ్లిపోతున్నారని విమర్శిస్తున్నారు. అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు అనేక అక్రమాలు చేశారని ఆరోపించారు. ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసినోళ్లు సేవ చేస్తామని వస్తున్నారు.. మెదక్ ప్రజలారా ఆలోచించాలని సూచించారు. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. రఘునందన్ ఎవరి జోలికి వెళ్లడని తన జోలికి వస్తే మాత్రం ఉరుకునేది లేదని స్పష్టం చేశారు.

గల్లీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దిల్లీలో మాత్రం మోదీనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని రఘునందన్ రావు అన్నారు. నాలుగు దశాబ్దాలుగా కాని పనులు తనను ఎంపీ గా గెలిపిస్తే చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. మెదక్ ఎన్నిక ఏకపక్షం కానుందన్న రఘునందన్ రావు ఆత్మగౌరవాన్ని కాపాడేలా పనిచేస్తానని స్పష్టం చేశారు.

About The Author

Related Posts

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?