ఉద్యోగులారా ... మన ఓటే... మన భవిష్యత్తు

కేఆర్ సూర్యనారాయణ, బాజీ పటాన్

ఉద్యోగులారా ... మన ఓటే... మన భవిష్యత్తు

 
ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి
 
 
విజయనగరం ( జర్నలిస్ట్ ఫైల్ ) : ఉద్యోగుల భవిష్యత్తును నిర్దేశించించేది మన ఓటే అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి గుర్తుంచుకొని...ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరు తప్పనిసరిగా వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, బాజీ పటాన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించే 30 ఉద్యోగ సంఘాలు ... ఉద్యోగ సమస్యలపై పోరాడేందుకు ఒకే తాటిపైకి వచ్చి   'ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక 'ను ఏర్పాటు చేసుకున్నాయి.
 
ఈ ఐక్య వేదికకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ను చైర్మన్ గా, మూడున్నర లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు వేదికైన ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాజీ పటాన్ ను సెక్రటరీ జనరల్ గా ఇటీవలే విజయవాడలో ఎన్నుకోవడం జరిగింది.
 
 రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం విజయనగరంలో  'ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యలు ... పరిష్కారం' అనే కార్యక్రమం నిర్వహించారు. కేఆర్ సూర్యనారాయణ, బాజీ పటాన్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సభలో ముందుగా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం అన్ని సంఘాల రాష్ట్ర నాయకత్వాలతో,  ఉద్యోగులతో, ఉపాధ్యాయులతో ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించడం జరిగింది.
 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఆర్ధిక ఇక్కట్లను, తమ జీతాల నుంచి వివిధ రూపాల్లో దాచుకున్న డబ్బులు తమకు అందకపోవడంపై, పేరుకుపోయిన 25 వేల కోట్ల రూపాయల బకాయిలపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 
 
అదేవిధంగా సీపీఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెల జీతంలో మినహాయించుకుంటున్న పది శాతం సొమ్ములు సక్రమంగా ప్రాన్ ఖాతాకు జమ చేయని కారణంగా సీపీఎస్  ఉద్యోగులకు ఆర్ధికంగా తీవ్ర నష్టం జరుగుతోందని పలువురు ఉద్యోగులు ప్రస్తావించారు. దాచుకున్న సొమ్ముల నుంచే సీపీఎస్ ఉద్యోగులకు పెన్షన్ ఇస్తారని... జీతాల నుంచి మినహాయిస్తున్న సొమ్ములు కూడా ప్రాన్ ఖాతాకు జమ కానీ కారణంగా అనేక మంది పదవీ విరమణ పొందే  సీపీఎస్ ఉద్యోగుల బతుకులు దుర్లభంగా మారాయి అని ఉద్యోగులు  ఐక్య వేదిక నేతల దృష్టికి తెచ్చారు.  రానున్న కాలంలో కూడా ఇదే గడ్డు పరిస్థితి కొనసాగితే ఉద్యోగుల కుటుంభాలు వీధిన పడుతాయాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
 
ఉద్యోగులు చెప్పిన అన్ని అంశాలను ఆలకించిన అనంతరం కేఆర్ సూర్యనారాయణ, బాజీ పఠాన్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత కీలకం  అని చెప్పారు. ఎవరి తలరాత నైనా, భవిష్యత్తు నైనా నిర్దేశించేది మన ఓటే అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో తప్పనిసరిగా  ఓటు వేయడం అనేది మనందరి బాధ్యత అన్నారు. మే 13 న జరిగే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు  వేసే ఓటుతోనే ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తు ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని నొక్కి చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లను సైతం అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు
 
వంద శాతం పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవాలి
 
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని  కేఆర్ సూర్యనారాయణ, బాజీ పటాన్ సూచించారు. విధుల్లో ఉన్న సిబ్బంది సంబంధిత నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని కలిసి పోస్టల్ బ్యాలెట్ ను  తీసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు . సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం  ఫెసిలిటేషన్ కేంద్రాలు ఉన్నాయని... ఈ కేంద్రాల్లో రహస్య ఓటింగ్ కంపార్టుమెంట్, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణ కోసం అటెస్టేషన్ అధికారి, కవర్ సీల్ కోసం గమ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్  ను వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచడానికి సహకరించాలని కోరారు
 
పోస్టల్ బ్యాలెట్ వినియోగంలో తప్పులు చెయ్యద్దు
 
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు చేసే తప్పిదంతో ఆ ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. దీంతో ఓటు వేసిన ఉద్యోగి యొక్క ఉద్దేశ్యం నెరవేరడం లేదు అన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై సరైన అవగాహన పెంచుకోవాలని, మనం వేసే ప్రతి ఓటు అభ్యర్థి భవిత్యవాన్ని మార్చుతుంది, మన ఓటును కచ్చితంగా తప్పులు లేకుండా వేయాలని సూచించారు.
 
ఓటరు జాబితాలో ఉన్న ప్రకారం డిక్లరేషన్ పత్రంపై ఉద్యోగి పూర్తి పేరు, చిరునామా, బ్యాలెట్ పత్రంలో ఉన్న సీరియల్ నెంబరు రాసి సంతకం చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏవైనా తప్పులు దొర్లితే ఆ ఓటును పరిగణించరు. డిక్లరేషన్ పత్రంపై కచ్చితంగా గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. పలువురు సిబ్బంది ఆ సంతకం లేకుండానే పోస్టల్ బ్యాలెట్‌లో ఓటు వేస్తున్నారు. దీంతో ఆ ఓట్లు చెల్లకుండానే పోతున్నాయని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అర్హులైన ప్రతి ఒక్క ఉద్యోగి అవగాహన పెంచుకుని , ఆప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
 
 ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు యం రమేష్ కుమార్ , సీహెచ్ పాపా రావు, కేదారేశ్వర రావు, రవీంద్ర బాబు, అబ్దుల్ రజాక్, మాగంటి శ్రీనివాసరావు  తదితరులు సభా వేదికపై అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించిన విజయనగరం స్ఠానిక నేతలను కేఆర్ సూర్యనారాయణ, బాజీ పటాన్ ప్రత్యేకంగా అభినందించారు.Screenshot 2024-04-14 213345

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?