అరకు కాఫీకి జాతీయ గౌరవం

అరకు కాఫీకి జాతీయ గౌరవం

- జీసీసీని అభినందించిన మంత్రి అచ్చెన్నాయుడు

అరకు వ్యాలీ కాఫీకి లభించిన జాతీయ గౌరవాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షించారు. ప్రతిష్టాత్మక బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ – 2025 లో “చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్” పురస్కారం దక్కించుకోవడం గిరిజన సమాజం గర్వించదగ్గ విషయం అని ఆయన అన్నారు. జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన రైతుల కృషి ఫలితంగా అరకు కాఫీ ఈ స్థాయి గుర్తింపు పొందిందని మంత్రి అభినందించారు. అరకు కాఫీ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాకుండా గిరిజన సమాజం ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ అవార్డు దక్కడం ద్వారా గిరిజన రైతుల శ్రమ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు. జీసీసీ చేస్తున్న కృషి గిరిజనుల అభివృద్ధికి కొత్త దారులను చూపిస్తోందని ఆయన అభినందనలు తెలిపారు. ఇలాంటి అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ గిరిజనుల కృషికి న్యాయం చేస్తాయి. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావాలని కోరుకుంటున్నాను అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

About The Author

Latest News