సాంకేతికత‌ను వినియోగించుకుని ఎరువులు పంపిణీకి సాధ్య సాధ్యాలు ప‌రిశీలించండి

సాంకేతికత‌ను వినియోగించుకుని ఎరువులు పంపిణీకి సాధ్య సాధ్యాలు ప‌రిశీలించండి

రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

రైతులకు ఇబ్బందులు లేకుంగా ఎరువులు పంపిణీచేయాల‌ని ఆదేశం

రైతుల ప్ర‌యోజ‌నాల‌ను దృష్టిలో పెట్టుకుని రానున్నరోజుల్లో సాంకేతిక‌త‌ను వినియోగించుకుని ఎరువులు పంపిణీకి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోట‌బొమ్మాళి తెలుగు దేశం పార్టీ కార్యాల‌యంలో సోమ‌వారం వ్య‌వ‌సాయ శాఖ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వ‌ర్యులు మాట్లాడుతూ భ‌విష్య‌త్‌లోఆధార్ అనుసందానం చేసి రైతుల‌కు ఎరువ‌లు  పంపిణీ అంశాన్ని సాధ్య సాధ్యాలు ప‌రిశీలించాల‌ని సూచించారు. ఒక్క‌రైతుకూడా ఇబ్బందులు ప‌డ‌కుండా ఎరువులు పంపిణీ చేయాల‌ని ఆధికారుల‌కు ఆదేశించారు.గ‌తం కంటే ల‌క్ష మోట్రిక్ ట‌న్నుల ఎరువులు మంజూరు చేయ‌డం జ‌రిగింద‌ని అన్నారు. స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌తో ఎరువులు పంపిణీ చేయాల‌ని సూచించారు. ప్ర‌ధానంగా నానో ఎరువుల ఆశ్య‌క‌త ,వాటి ప్ర‌యోజ‌నాలు రైతుల‌కు ప్ర‌త్య‌క అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు.ప్ర‌తి ఒక్క‌రైతు ఈ పంట న‌మోదు చేసుకునేలా ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు.శాస్త్రవేత్తల సూచనలు పాటించి అవసరమైన మేరకేఎరువులు,పురుగుమందులు వాడే విధంగా రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని,నానో ఎరువులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, వాటి ఉప‌యోగాలు రైతుల‌కు తెల‌పాల‌ని సూచించారు. డ్రోన్ల ద్వారా పిచికారి చేయడం ద్వారా రైతులుమెరుగైన లాభాలు పొందవచ్చని అన్నారు. కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ శాఖ జేడీ త్రినాధ‌రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Latest News