రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ విజయదశమి అనేది సత్యం, ధర్మం, న్యాయం చెడుపై సాధించే విజయానికి ప్రతీక. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, సుభిక్షం నింపాలని మనసారా కోరుకుంటున్నాను. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమానికి ప్రధాన ప్రాధాన్యం ఇస్తూ, పంటలకు మద్దతు ధరలు కల్పించడం, రాయితీలు ఇవ్వడం, సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, విద్యుత్‌ను సమృద్ధిగా అందించడం ద్వారా రైతుల ముఖాల్లో చిరునవ్వులు తెప్పించగలిగాం. రైతు శ్రేయస్సే కూటమి ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యం. గడచిన కొద్ది నెలల్లోనే రైతు బంధువులందరికీ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ విజయదశమి సందర్భంలో రైతాంగం మరింత బలపడాలని, వారి శ్రమతో ఆంధ్రప్రదేశ్ సుసంపన్నంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు.