మారుమూల ప్రాంతంలో మానవీయ వెలుగులు
సీఎంఆర్ఎఫ్ తరఫున 130 మంది లబ్ధిదారులకు రూ. 2 కోట్లకు పైగా ఆర్థిక సాయం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవే ఇందుకు కీలకం
బాధితుల కళ్లల్లో వెలుగులు..అచ్చెన్న కృషి ఫలితంతోనే సానుకూలతలు
నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ తరఫున రెండు కోట్ల పైగా నిధులు అందజేత
మానవతకు నిదర్శనం..ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు చేయూతే తార్కాణం
ఆపద వేళ..అభయ హస్తం..మంత్రి అచ్చెన్న చొరవ ప్రశంసనీయం
బాధితుల కళ్లల్లో ఆనందోత్సాహాలు..
టెక్కలి (జర్నలిస్ట్ ఫైల్) : మారుమూల ప్రాంతంలో మానవీయ వెలుగులు ప్రసరిస్తున్నాయి. కష్టం అంటే చాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కదిలి వస్తున్నారు. ఫలితంగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి తరఫున ఎన్నడూ లేని విధంగా, త్వరితగతిన ఆరోగ్య సంబంధ సమస్యలకు సంబంధించి బాధితులకు గొప్పనైన భరోసా అందుతోంది. తత్ ఫలితంగా 130 మంది లబ్ధిదారులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదని కానీ ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకు నిముఖ్యమంత్రి సహాయ నిధి సకాలంలో అందేలా కృషి చేసి, కొన్ని వందల కుటుంబాల్లో వెలుగులు నింపడం ఓ గొప్ప పరిణామం అని బాధితులు చెబుతున్నారు. ఆనందోత్సాహాలతో చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ...బాధితుల గుండె ఘోష వింటూ...
ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటిదాకా రెండు కోట్ల రూపాయలకు పైగా ఏడాదిన్నర కాల వ్యవధిలోనే అందించడం, ఇందుకు అనుగుణంగా పరిణామాలు సానుకూలం కావడం బాధిత వర్గాలలో అచ్చెన్న నింపిన స్ఫూర్తి ఓ కారణం. అలానే ఏ సమస్య వచ్చినా నేనున్నానని ఇరవై నాలుగు గంటలూ కార్యాలయ వర్గాలను అందుబాటులో ఉంచి బాధిత వర్గాల గోడు వినేందుకు ప్రాధాన్యం ఇస్తున్న మంత్రి అచ్చెన్న చొరవ చిర స్థాయిలో నిలవనుంది. ఏ నాయకుడికీ లేని విధంగా ఆయన ఆఫీసు వర్గాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ బాధిత వర్గాలకు చెందిన సమాచారాన్ని విజయవాడకు చేరవేస్తూ, ఆరోగ్య సంబంధ సమస్యల పరిష్కారంలో ముఖ్యంగా కీలక శస్త్ర చికిత్సల సమయంలో చొరవ చూపి పని చేస్తుండడంతో మంత్రి అచ్చెన్నకు ఈ నియోజకవర్గంలో మరింత మంచి పేరు వస్తున్నది. ఇటీవలే ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతన లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ఇతరుల ప్రమేయానికి తావే లేదు...అవసరం అయితే అచ్చెన్న మాట్లాడతారు
ఒకప్పుడు గత ప్రభుత్వ పాలనలో మాదిరిగా ఇతరుల ప్రమేయం కూడా లేదు. అవసరం అయితే తానే స్వయంగా సంబంధిత కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్నారు. పేదలకు పెన్నిధిగా ఆయన నిలుస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు మార్గ దర్శకాలు అందుకుని ఎప్పటికప్పుడు మానవీయ దృక్పథంతో పనిచేయడం తనకు ఎంతో ఆనందం ఇస్తోందని వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. ఒకప్పటిలా ఆఫీసుల చుట్టూ తిరిగే అవస్థ అన్నది లేకుండా చేయడం కోసం మంత్రి అచ్చెన్న చేసి కృషి అనతి కాలంలోనే సత్ఫలితాలు వస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి, సుదూర ప్రాంతాల నుంచి సాయం అంటూ వచ్చే వారికి తన ఆఫీసులో పట్టెడన్నం పెట్టి పంపుతుండడం కూడా విశేషం.
అడుగడుగునా మానవీయ కోణం బాధితులకు అండగా ఉండేందుకేతొలి ప్రాధాన్యం
వివిధ పనులపై కార్యాలయంకు వచ్చే వారికి ,నాణ్యమయిన భోజనం అందిస్తుండడం శుభ పరిణామం. ఇదే విషయమై మంత్రి అచ్చెన్న స్పందిస్తూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఏ ఒక్కరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదన్న ఆశయంతో తన వంతు కృషి చేస్తున్నానని, ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఎంతగానో సహకారం అందిస్తున్నాయని తెలిపారు. ఆపద సమయంలో అత్యవసరంగా అప్పు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు రిలీఫ్ ఫండ్ కొండంత అండగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వైద్యశాలలో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది పునరుద్ఘాటించారు.