ప్రముఖ రచయిత పరుచూరి నారాయణచార్యులు (లల్లాదేవి) మృతి
ప్రత్తిపాడు(జర్నలిస్ట్ ఫైల్): ప్రముఖ రచయిత పరుచూరి నారాయణ ఆచార్యులు(కలంపేరు.లల్లాదేవి) శుక్రవారం ఉదయం వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం, నిమ్మగడ్డవారిపాలెంలో మృతి చెందారు.వారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. వారికి భార్య ఆదిలక్ష్మి,కుమారుడు నందగోపాల్,కుమార్తె హరి ప్రసన్నారాణి ఉన్నారు.ఆయన మృతి పట్ల పలువురు అభిమానులు,ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తను రచయితగా వ్రాసిన వివిధ మాస పత్రికలు,వార పత్రికలు, పక్షపత్రికలు,దినపత్రికలందు సుమారు 40 సీరియల్స్ పైగా వెలువడ్డాయి.ఆయన రచించిన కథలు,జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వంలో కరుణించిన కనకదుర్గ,శ్వేత నాగు. అరణ్యదల్లి,అభిమన్యు సినిమాలు గా రూపుదిద్దుకొని ప్రేక్షకుల మన్ననలు పొందాయి.వారి సినిమాలు టీవీల్లో కూడా ప్రచారం అయినాయి వారికి 5 అవార్డులు వచ్చాయి.లల్లాదేవి రచించిన14 నవలలు కన్నడంలోకి అనువదించ బడి ధారావాహికంగా ప్రచురింపబడ్డాయి,ఇవి కాకుండా వారు అనేక రేడియో ప్రసంగాలు చేశారు.తిరుపతి తిరుమల దేవస్థానం ఆర్థిక సహాయంతో లల్లా రామాయణం,డబ్ల్యూహెచ్వో సమాచారం ఆధారంగా ఎయిడ్స్ నవల తదితర ప్రచురణలు జనాదరణ పొందినవి.ఇవే కాక వారు అనేగా చారితాత్మక రచనలు రచించి పలువురు అభిమానుల మన్ననాలు పొందారు.కాగా వారి భౌతిక కాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా నాయకులు మర్రి వెంకట శివయ్య, చెన్నుపాటి శివ నాగేశ్వరరావు,కుర్ర హరిబాబు లాంటి ప్రముఖులు, అభిమానులు,గ్రామస్తులు ఎందరో పాల్గొని లల్లాదేవి కి నివాళులర్పించారు.