ఏపీ ఎస్ఆర్ఎం కు 'క్యూ ఎస్-ఐ గేజ్ డైమండ్ రేటింగ్'
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): ఏపీఎస్ఆర్ఎం యూనివర్శిటీకి దేశీయంగా ప్రతిష్టాత్మకమైన గుర్తింపు లభించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ' క్యూ ఎస్-ఐ.గేజ్ సంస్థ' యూనివర్సిటీ పనితీరును , అత్యున్నతమైన విద్యా బోధన, పరిశోధన, విద్యా ప్రమాణాలను విశ్లేషించి డైమండ్ రేటింగ్ ను ప్రకటించింది.
అత్యాధునిక సదుపాయాల కల్పన విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ప్లాటినమ్ రేటింగు ప్రకటించిన క్యూఎస్ ఐ
గేజ్ సంస్థ ఉద్యోగాల కల్పన, టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్, డైవర్సిటీ వంటి కీలక అంశాలను విశ్లేషించి గోల్డ్ రేటింగ్ ను అందజేసింది. గవర్నెన్స్, మౌలిక సదుపాయాల కల్పన వంటి విషయాల్లో సిల్వర్ రేటింగ్ ను ప్రకటించింది. ప్రతిభ గల ఫ్యాకల్టీల ఏర్పాటు, విద్యా ప్రమాణాలు, పరిశోధనల్లో నూతన పంథా, అంతర్జాతీయ స్థాయి ఎంవోయూలను కూలంకుషంగా విశ్లేషించిన సంస్థ ఓవరాల్ గా ఏపీ ఎసీఆర్ ఎం యూనివర్సిటీకి డైమండ్ రేటింగ్ ను ప్రకటించింది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్యూ ఎస్-ఐ గిజ్ నుంచి డైమండ్ రేటింగ్ లభించడం ఎంతో సంతోషంగా ఉందని వర్సిటీ ఇన్ ఛార్జి వైస్ ఛాన్సిలర్ ఆచార్య
సతీష్ కుమార్ పేర్కొన్నారు. యూనివర్సెటిలో భోధన, పరిశోధన వంటి కీలక అంశాల్లో మరింత పురోగతిని సాధిస్తామని క్వాలిటీ అన్యూరెన్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ కార్తీక్ రాజేంద్రన్ పేర్కొన్నారు.