ఎస్ఆర్ఎంలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్

ఎస్ఆర్ఎంలో రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) :ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో శుక్రవారం మూడవ రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ జరిగింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ బలరామ్ పద్మనాభన్ ముఖ్య అతిధిగా హాజరై సదస్సును ప్రారంభించి రీసెర్చ్ స్కాటర్లను ఉద్దేశించి ప్రసంగించారు.. పరిశోధనా రంగంలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థి ప్రధానంగా విజ్ఞానాన్నీ, పరిశోధనాంశాలపై పట్టు పెంచుకోవాలన్నారు. రోజురోజుకీ సైన్స్ విస్తృతమవుతున్న ప్రస్తుత రోజుల్లో నూతన ఆవిష్కరణలు భారత్ కీర్తిని మరింత ఇనుమడింపజేస్తున్నాయన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన భారత వాతావరణ పరిశోధనా ప్రయోగశాల (ఎన్ఏఆర్ఎల్) డైరెక్టర్ డాక్టర్ అమిత కుమార్ పాత్ర మాట్లాడుతూ, ఆసక్తి లేనిదే ఆవిష్కరణలు అసాధ్యమన్నారు. మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ప్రగతి సాధిస్తుందని, శాస్త్రీయ పరిశోధన దేశ అభివృద్ధికి ఎంతో ఉపయుక్తంగా మారుతుందన్నారు. నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు.

 నూతన ఆవిష్కరణలకు యూనివర్సిటీలు కేంద్రాలుగా మారాలని ఎస్ఆర్ఎం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య డి నారాయణరావు సూచించారు. చంద్రయాన్ తో భారత్ కీర్తి విశ్వవ్యాప్తంగా మారిందని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకటించిందని,  ఇందులో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నోడల్ ఏజెన్సీగా గుర్తించబడిందని ఆయన పేర్కొన్నారు. ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ లో క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందని నారాయణరావు పేర్కొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ రీసె ర్చ్  సమ్మిట్ ఏర్పాటు చేయడం పరిశోధనా అంశాలపై అవగాహన కలిగించడం ఉపయుక్తంగా మారిందని పేర్కొన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ బలరామ్, అమిత్ కుమార్ పాత్రో, టి నారాయణరావు లను యూనివర్సిటీ యాజమాన్యం సత్కరించింది. ఈ సందర్భంగా వేదికపై రీసెర్చ్ అబ్ స్ట్రాక్ట్ బుక్లెట్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం రీసెర్చ్ డీన్ డాక్టర్ రంజిత్ తప,  రిజిస్ట్రార్ ఆర్ ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News