అంబేద్కర్ ఆలోచనా విధానమే జగనన్న మార్గం

-ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి 

అంబేద్కర్ ఆలోచనా విధానమే జగనన్న మార్గం

ప్రపంచ మేథావి అంబేద్కర్
- వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ 


  గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ )  : భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా ప్రపంచంలోనే అదిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్నట్లు ప్రభుత్వ విప్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి వెల్లడించారు. ప్రపంచ దేశాలలోనే అగ్రగామి దేశంగా నిలబడటానికి ప్రధాన కారణం మన రాజ్యాంగమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మహనీయుడైన అంబేద్కర్ ఆలోచనా విధానంతో ముందుకు సాగుతూ అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా మారి అట్టడుగున ఉన్న వారిని అందలమెక్కిస్తున్నారని కొనియాడారు.

              భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు బృందావన్ గార్డెన్స్‌లోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగాయి. ఎస్సీ నేత ఆలా కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము), రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులతో కలిసి లేళ్ళ అప్పిరెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

       అనంతరం లేళ్ళ అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా భారతీయులందరికీ ఉమ్మడి పవిత్ర గ్రంథాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపించిన బాట అందరికి ఆదర్శనీయం అన్నారు. వర్ణవివక్ష, కులవివక్షలను రూపుమాపేందుకు అంబేద్కర్ రాజ్యాంగం రూపంలో మన దేశానికి ఒక తారకమంత్రం ఇచ్చారని చెప్పారు. భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నప్పటికి వారందరూ కలసిమెలసి సహజీవనం చేయగలుగుతున్నారంటే అందుకు అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే కారణమన్నారు. సమానత్వాన్ని సాధించేందుకు ఎనలేని కృషి చేసిన మహనీయుడిగా అంబేద్కర్‌ను అందరూ స్మరించుకోవాలని కోరారు.

          ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంబేద్కర్ ఆశయాలనే తన ఆశయాలుగా మలచుకుని ఆయన కలలుగన్న సమానత్వ సమాజ స్థాపన దిశగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా సమాజంలో నిరాదరణకు గురై నిరుపేదలుగా మగ్గుతున్న లక్షలాది కుటుంబాల ఇళ్ళ తలుపులు తట్టి మరీ వారికి లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. సమానత్వ సాధనకు  పేదరికం పెద్ద అవరోధం అన్న వాస్తవాన్ని గుర్తించి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే తమకు ఇంతగా మేలు చేసిన వైయస్ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అణగారిన బడుగు బలహీన వర్గాలన్నీ మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు ఆయన  వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పరిరక్షణ దిశగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అండగా నిలబడతామని ప్రతి ఒక్కరూ ప్రతినబూనడం ద్వారా అంబేద్కర్‌కు నిజమైన నివాళి అర్పించాలని లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.

        డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైయస్ జగన్ నేతృత్వంలో ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, అటు ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమ సమానత్వ సాధనకు ఎంతగానో కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచ మేథావిగా గుర్తింపు పొందిన బాబా సాహెబ్ అంబేద్కర్ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయారని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనగలగడానికి ప్రధాన కారణం అంబేద్కర్ అని కీర్తించారు. ఆయన ఆశయాలను వైయస్ జగన్ నేతృత్వంలో తామంతా సంఘటితంగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు.

           ఈ కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), షేక్ రోషన్, పడాల సుబ్బారెడ్డి, అంబేద్కర్, బూసి రాజలత, గేదెల రమేష్, బోడపాటి కిషోర్, మోతుకూరి వెంకటరత్నం, గీతా మందిరం ఛైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, నవ్యాంధ్ర యమ్మార్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు, పార్టీ నేతలు అంగడి శ్రీనివాసరావు, ఉడతా కృష్ణ, అత్తోట జోసెఫ్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, పానుగంటి చైతన్య, ఓర్చు శ్రీనివాసరావు, ఆనం సంజీవరెడ్డి, మాదాసు కిరణ్, ఆలా కిరణ్, కాటూరి విజయ్, మహేంద్ర గులేచ, మిర్చి యార్డు డైరెక్టర్లు కొత్తపల్లి శివసాంబిరెడ్డి, కొత్తపేట సతీష్, షేక్ రబ్బానీ, కౌండిన్య, బైరెడ్డి రవీంద్రారెడ్డి, రెడ్డి కోటేశ్వరరావు, మాదాసు భాగ్యారావు, గనిక జాన్సీ, వెంకాయమ్మ, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?