పేద గుండెల ఉచిత చికిత్స వ్యయం రూ. 1,003 కోట్లు

పేద గుండెల ఉచిత చికిత్స వ్యయం రూ. 1,003 కోట్లు

ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా 15 నెలల్లో 1.41 లక్షల మందికి అయిన ఖర్చు రూ. 996 కోట్లు

మరో 3,402 మందికి రూ. 7 కోట్లు విలువైన 'గోల్డెన్ అవర్' చికిత్స

ప్రజారోగ్య సంరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ పాలన

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్

ప్రపంచ హృద్రోగ దినోత్సవo

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్)  : ఆరోగ్య సంరక్షణ గురించి వైద్య సేవలను కూటమి మందికి గుండె సంబంధిన ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూనే మరోపక్క ఆసుపత్రుల్లో  వైద్య సేవలు, మౌలిక వసతులు  మెరుగుపరుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి సెప్టెంబరు 26వ తేదీ వరకు 1.41 లక్షల మందికి రూ.996 కోట్ల విలువైన వైద్యాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా ఉచితంగా అందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  సత్యమార్ యాదవ్ తెలిపారు అలాగే... గుండెపోటుకు గురైన వారికి మండలాల స్థాయిలో తొలిగంట (గోల్డెన్ అవర్)లో అందించిన రూ.7 కోట్ల విలువైన వైద్యంతో 3,402 మందికి ప్రాణాయ పరిస్థితులు తప్పినట్లు చెప్పారు. ఈ నెల 29 (సోమవారం) ప్రపంచ హృద్రోగ "దినోత్సవం సందర్భంగా మంత్రి సత్యకుమార్ ఆదివారం ఓ ప్రకటన జారీచేశారు.

గుండె చికిత్సకు అయిన వ్యయమే అత్యధికం

'ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు చికిత్స పొందిన వారు 19,61,257 మంది ఉండగా వీరికి అందించిన చికిత్సల వ్యయం రూ. 5,562కోట్లు ఇందులో హృద్రోగ సమస్యలతో చికిత్స పొందిన వారు 1,41,315 మంది ఉన్నారు. వీరికి రూ.996.20 (17.91%) కోట్ల విలువైన వైద్యాన్ని కూటమి ప్రభుత్వం అందించింది. వీరిలో స్టంట్లు 45,986 (32.54%) మంది, బైపాస్ సర్జరీలు 9,880 (6.99%), వాల్వ్ రీప్లేస్ వేయించుకున్న వారు 3,074 (2.18%) మిగిలిన వారిలో ఇతర సమస్యలు కలిగిన వారు ఉన్నారని తెలిపారు క్యాన్సర్ బాధితులు 69,926 మంది ఉండగా వారికి కూటమి ప్రభుత్వం రూ.965.48 (17.36%) కోట్ల విలువైన వైద్యాన్ని అందించింది. ఆ తరువాత ఆర్థో కు సంబంధించి 2,04,108 మంది చికిత్స పొందారు. వీరికి అయిన వ్యయం రూ.641.89 (11.54%) కోట్లు" అని మంత్రి సత్యకుమార్ వివరించారు.

ఎయిమ్స్, శ్రీకాకుళం స్పెషాల్టీ ఆసుపత్రిలోనూ..

"గుండె సంబంధ వ్యాధుల చికిత్స అందించే ఆసుపత్రుల సంఖ్య గతంలో కంటే కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన అనంతరం పెంచాం ప్రైవేటు, కార్పొరేటు రంగంలో కలిసి 161 ఆసుపత్రులు, 26 ప్రభుత్వాసుపత్రుల్లో గుండె సంబంధ వ్యాధుల చికిత్స ప్రస్తుతం అందుబాటులోనికి తెచ్చాం. మంగళగిరి ఎయిమ్స్, శ్రీకాకుళంలోని మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రిలోనూ గుండె సంబంధ వ్యాధులకు చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు ద్వారా అందుబాటులోనికి తెచ్చాం. 2023-24లో కంటే 2024-25 లో ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య 13,921 నుంచి 17,500కు పెరిగింది" అని మంత్రి  సత్యకుమార్ వెల్లడించారు.

238 అసుపత్రుల్లో 'గోల్డెన్ అవర్" చికిత్స

'రాష్ట్రoలో 238 ఆసుపత్రుల్లో గోల్డెన్ అవర్ చికిత్స అందుబాటులో ఉంది. 'స్టె మీ' విధానంలో గుండెపోట్లకు గురైన వారికి గోల్డెన్ అవర్లోనే ఈ ఆసుపత్రుల్లో ఉచితంగా బాగా ఖరీదైన ఇంజెక్షన్ను ఇవ్వడం ద్వారా 3,402 మంది రోగుల ప్రాణాపాయ పరిస్థితులు తప్పాయి సామాజిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ఈ వైద్యం అందుబాటులోనికి తీసుకువచ్చాం. టెలీ మెడిసిన్ (హబ్ అండ్ స్పోక్) విధానంలో గోల్డెన్ అవర్లో గుండెపోట్లుకు గురైన వారికి త్వరితగతిన చికిత్స అందించేందుకు అమల్లోనికి తెచ్చిన 'స్టెమీ' విధానం 3,402 మందికి టెనెక్ట్ ప్లేస్ (రక్త గడ్డం కరగడానికి) ఇంజక్షన్లు ఇచ్చాం.  ఖరీదైన వీటి విలువ రూ.7 కోట్లు. ఈ ఇంజక్షన్ పొందిన వారి ఆరోగ్యం కుదటపడిoది   ఈ ఇంజక్షన్ లను గ్రామీణులకు అందుబాటులో ఉంచుతున్నాo'' అని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఏ మాత్రం రాజీపడడంలేదన్నారు.

ముందస్తు పరీక్షల ద్వారా..

"అసాంక్రమిక వ్యాధుల గుర్తింపులో భాగంగా రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ (ఓరల్, బ్రెస్టు, సర్వైకల్) లక్షణాలు కలిగిన వారిని సర్వే ద్వారా గుర్తిస్తున్నాం. వీటి ద్వారా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తించిన వారికి తదుపరి చికిత్స అందిస్తూనే జీవనశైలి, ఇతర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఆరోగ్యాలు బాగుంటాయి. రాష్ట్రం పై రోగాల భారం కూడా తగ్గుతుంది" అని
మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

About The Author

Latest News