విద్యుత్ శాఖ విజిలెన్స్ విస్తృత తనిఖీలు

విద్యుత్ శాఖ విజిలెన్స్ విస్తృత తనిఖీలు

నరసరావుపేట ( జర్నలిస్ట్ ఫైల్ ) : పల్నాడు జిల్లాలో విద్యుత్ శాఖ విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో మాచెర్ల పట్టణంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆపరేషన్ విభాగ పర్యవేక్షక ఇంజనీర్ డాక్టర్ పి.విజయకుమార్ సమన్వయంలో నలభై ఐదు మంది అధికారులు, నూటముప్పై ఐదు మంది సిబ్బంది నలభై ఐదు బృందాలుగా ఏర్పడి మొత్తం నాలుగు వేల మూడు వందల పదకొండు సర్వీసులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో విద్యుత్ చౌర్యం మరియు అక్రమ వినియోగం జరిగినట్లు గుర్తించి మొత్తం మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల జరిమానా విధించారు.

వినియోగదారులు తమ ప్రాంగణంలో ఉన్న మీటర్లకు తప్పనిసరిగా సీలు ఉండేలా చూసుకోవాలని అధికారులు సూచించారు. సీలు లేకపోయినా లేదా తుప్పు పట్టి ఊడిపోతే వెంటనే సంబంధిత అధికారి కి రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. భారత విద్యుత్ చట్టం సెక్షన్ 135 ప్రకారం మీటరు లేకుండా, లేదా పనిచేయని మీటరు నుంచీ విద్యుత్ వినియోగించడం విద్యుత్ చౌర్యంగా పరిగణించబడుతుందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. మొదటి తప్పిదానికి కాపౌండింగ్ పద్ధతిలో జరిమానా చెల్లిస్తే కేసు నుండి విడిపిస్తారు. రెండవసారి మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపిస్తారు.

విద్యుత్ చౌర్యం సామాజిక నేరమని అధికారులు తెలిపారు. చౌర్యం జరిగిందని అనుమానిస్తే 9440812263, 8639741050 నంబర్లకు నేరుగా లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని భరోసా ఇచ్చారు. ఈ తనిఖీల్లో డీఈఈ ఏ.రామయ్య, విజిలెన్స్ డీఈఈలు కె.రవికుమార్, ఎస్.శ్రీనివాసరావు, ఏఈఈలు కె.కోటేశ్వరరావు, ఎం.సతీష్‌కుమార్, యు.శివశంకర్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Latest News