ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

 
పెన్షన్ పాలకుల భిక్ష కాదు...పెన్షన్  పొందే హక్కు ఉద్యోగులది
 
ఉద్యోగుల సమస్యలపై  ఒంగోలులో  రౌండ్ టేబుల్ సమావేశంలో
 
ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ
 

ఒంగోలు ( జర్నలిస్ట్ ఫైల్ ) 30 రోజులు కష్టపడి పనిచేసిన తరువాత ఒకటో తారీకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత ,  30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తదనంతరం వృద్ధాప్యంలో పెన్షన్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే...  వృద్ధాప్యంలో పెన్షన్  పొందే హక్కు ఉద్యోగులది...  పెన్షన్  పాలకుల భిక్ష కాదని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ లైక్ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ   పేర్కొన్నారు .

 
సిపీఎస్- జిపీఎస్ రద్దు  - పాత పెన్షన్ అమలు, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం అఫ్ పెన్షన్ అమల, రూ.  25వేల కోట్ల పైబడి ఉద్యోగులకు ఉన్న పెండింగ్ బకాయిలు , పిఆర్సి,  డి.ఏ,  ఏపీజీఎల్ఐ, బకాయిల చెల్లింపు పై స్పష్టమైన హామీ అనే అంశాలపై ఒంగోలు నగరంలోని రంగా భవన్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి  అధ్యక్షతన  గురువారం నిర్వహించిన  రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా కె.ఆర్ సూర్యనారాయణ  హాజరై   చర్చా గోష్టి నిర్వహించారు. అనంతరం జరిగిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు.
 
ఉద్యోగులకు జరిగే అన్యాయంపై నిరంతరం ప్రశ్నిస్తా ..
కె.ఆర్ సూర్యనారాయణ 
 
రాష్ట్రంలో ఉద్యోగుల పక్షాన నిలవాల్సిన నాయకత్వం నిస్సత్తువతో ఉందని... ఉద్యోగుల హక్కును సాధించడానికి ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన అనేక ఆర్థిక ప్రయోజనాలను తెచ్చుకోవడానికి ఉద్యోగుల పక్షాన ఒక మొరిగే కుక్కలాగా ఉంటానని ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయంపై ప్రతిక్షణం నిరంతరం ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉంటానని  కె.ఆర్ సూర్యనారాయణ  అన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ద్వారా ఎదురైన సమస్యల పరిష్కరించడంలో కొంత అలసత్వం జరిగిందని , ఆర్టీసీ ఉద్యోగులు కార్పొరేషన్ కు  చెందిన వారా లేక ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
 
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమిస్తూ సరైన సర్వీస్ నిబంధనలు ఏర్పరచక పోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.రెండు సంవత్సరాలు అప్రెంటిస్ పీరియడ్ కు నోషనల్  ఇంక్రిమెంట్లు ఇవ్వకపోవడం ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు అని ,వీరికి నొషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.  అదే సమయంలో సర్వీస్ రెగ్యులరేషన్ కోసం 9 నుంచి 10 నెలలు ఆలస్యం అయినందున ఆ పది నెలల జీతాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు.
 
ప్రభుత్వం ఏదైనా సరే... సీపీఎస్ రద్దు చేయాల్సిందే : బాజీ పటాన్

 

 ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ బాజీ పటాన్ మాట్లాడుతూ...  సిపిఎస్ రద్దు చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి... ఇప్పుడు తలాతోకాలేని జిపిఎస్ విధానాన్ని తీసుకువచ్చి రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులను నట్టేట ముంచారని ప్రభుత్వాలు ఏవైనా సిపిఎస్ ను గాని జిపిఎస్ ను గాని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అన్నారు. బలవంతంగా నెత్తిన రుద్దాలని ప్రయత్నం చేస్తే ఉద్యమిస్తామని అలాగే గత ఐదు సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యోగులకు రావలసిన డిఏ బకాయిలు నగదు రూపంలో చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే తగు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదే సందర్భంలో గత ఐదు సంవత్సరాల కాలంలో మరియు అంతకుముందు సిపిఎస్ ఉద్యమాల సమయంలో బనాయించిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోనకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
 
పదోన్నతి అనేది ఉద్యోగుల హక్కు : కరణం  హరికృష్ణ
 
ఐక్య వేదిక కో చైర్మన్ కరణం హరికృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు గత 30 సంవత్సరాలుగా ఎలాంటి సర్వీస్ నిబంధనలు లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయని వీటిపై సరైన పరిష్కార మార్గాలను అన్వేషించడంలోనూ, సూచించడంలోనూ అటు ప్రభుత్వాలు ఇటు  ఉపాధ్యాయ సంఘాలు విఫలమయ్యాయని ఉపాధ్యాయులకు పదోన్నతి అనేది ఒక హక్కుగా సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని గుర్తు చేస్తూ పదోన్నతిలో కలిగే ఇబ్బందులను తొలగించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఉపాధ్యాయులపై అనేక ఒత్తిడులు లు ఉన్నాయని ఉపాధ్యాయుడు పై పని భారం ఎక్కువైందని జీవో నంబర్ 117 ద్వారా అనేక ఉపాధ్యాయ పోస్టులు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఆర్టీసీ ఉద్యోగులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అమలు చేయాలి : బి .కేదారేశ్వర రావు
 


ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు బి .కేదారేశ్వర రావు  మాట్లాడుతూ ... ఆర్టీసీ వీలైన సమస్యలు పరిష్కరించాలని ఇంతకు ముందున్నట్లుగా అనారోగ్యంతో వచ్చిన ఆర్టీసీ ఉద్యోగులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ఎలాంటి పరిధిలేకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు.

ప్రతి ఉద్యోగి ఓటు హక్కును వినియోగించుకోవాలి : మాగంటి శ్రీనివాస రావు
 
ఐక్య వేదిక ఆర్గనైజింగ్ సెక్రటరీ మాగంటి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి తన ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ కోసం తగిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తో డెకరేషన్ తీసుకోవాలని ఎవరైనా పోస్టల్ బ్యాలెట్ కు ఇంకా అప్లై చేయని వారు ఉంటే తెలియజేయాలని,  ఏమైనా సమస్యలు ఉంటే ఐక్యవేదిక దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ఎన్నికల అధికారికి, అవసరమైతే కేంద్ర ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువచ్చి ప్రతి ఉపాధ్యాయ ,ఉద్యోగి ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఉన్న ఆటంకులను తొలగించడానికి మన చైర్మన్  కేఆర్ సూర్యనారాయణ గారు కృషి చేస్తారని తెలిపారు..
 
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి పి వర కుమార్, ఏపీ సీపీఎస్ఈ ఏ పాండు రంగారావు, ఎన్ మోహన్ రావు, రాము, నర్సింగారావు, విజయ్ కుమార్, సురేష్, పి వి నారాయణ, కే శ్రీనివాసులు, నాగేశ్వరరావు, మాధవి, రమణారెడ్డి, రంగారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, భాను, మసూద్ అలీ తదితరులు పాల్గొన్నారు

About The Author

Advertisement

Latest News

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ బొమ్మలా..?: చంద్రబాబు
అన్నమయ్య జిల్లా బ్యూరో/ తిరుపతి బ్యూరో ( జర్నలిస్ట్ ఫైల్ ): పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ బొమ్మలు ఎందుకున్నాయని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ...
పేదల భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు... వైసీపీ గెలుపే సామాన్యుడి భవిష్యత్తు
టీడీపీని చావుదెబ్బ తీయండి
పోలింగ్ సమయం పెంచండి.. ఈసీకి టీడీపీ  విజ్ఞప్తి
జగన్ ప్రచారంపై ఈసీ తక్షణమే నిషేధం విధించాలి: మాజీ మంత్రి ప్రత్తిపాటి
' జగన్ కోసం సిద్ధం'... ఇంటింటికీ మేనిఫెస్టో
పోలింగ్ కేంద్రాల ఎంపిక ఇలాగేనా?