బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జాషువా

బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన జాషువా

 జాషువాకు నివాళులర్పించిన మన్నవ

ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్టు ఫైల్)  : తెలుగు సాహిత్యలోకంలో దిగ్గజ కవికోకిల  గుర్రం జాషువా  130వ జయంతి సందర్భంగా గుంటూరు నగరంపాలెంలోని గుర్రం జాషువా  విగ్రహానికి  ఆదివారం  ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా మన్నవ మోహనకృష్ణ  మాట్లాడుతూ... తన జీవిత పర్యంతం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహానీయుడు అని అన్నారు. తన కవితల ద్వారా సమాజంలో సమానతులను రూపుమాపడానికి అహర్నిశలు శ్రమించారన్నారు. కవితల ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించిన ఈ మహానీయుడుకు స్ఫూర్తిదాయకం అన్నారు.గుర్రం జాషువా నేటి యువతరానికి ఆదర్శ దాయకమని మన్నవ మోహనకృష్ణ  అన్నారు.

About The Author

Latest News