సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలి లేళ్ళ అప్పిరెడ్డి
-గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా రాజకీయాల గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావన వచ్చినా ప్రముఖంగా వినిపించే పేరు లేళ్ళ అప్పిరెడ్డి అని గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బందా రవీంద్రనాథ్ వెల్లడించారు.
వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలు గుంటూరులో ఘనంగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్ధి విభాగం జిల్లా సంయుక్త కార్యదర్శి దర్శనపు కిరణ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గుండారావు పేటలో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బందా రవీంద్రనాథ్ మాట్లాడుతూ, రాజకీయంగా లేళ్ళ అప్పిరెడ్డి ఆలోచనలు ఎప్పుడూ ఎంతో ఉన్నతంగా ఉంటాయని తెలిపారు. సమరశీల భావాలతో మెలిగే స్నేహశీలిగా ఆయనను అభివర్ణించారు. విశాల దృక్పధంతో.. విలక్షణ శైలితో.. రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన లేళ్ళ అప్పిరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్న ఆకాంక్షను బందా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధి విభాగం నేతలు విఠల్, వినోద్, గంటి, రవి, జగదీష్, బాజి, కరీం, రాజేష్, అజయ్, సాజిద్, వినోద్, రూబి, ఫజల్ తదితరులు పాల్గొన్నారు.