ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ

ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై త్వరితగతిన జిఓ – రవాణా మంత్రిహామీ

విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) ఆర్టీసీ విలీనం అనంతరం పదోన్నతులు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జిఏడిలో పెండింగులో ఉన్న జిఓను త్వరితగతిన అమలు చేయించేందుకు కృషి చేస్తానని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ విషయం సోమవారం ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి. నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన వివరాల ప్రకారం, గత ఆరేళ్లుగా అసిస్టెంటు మెకానిక్ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు ఉన్న పదోన్నతులు వివిధ కారణాలతో నిలిచిపోయాయి. ఈ సమస్యపై ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తూ రావడంతో ఆర్టీసీ వీసీ అండ్ ఎం.డి ద్వారకా తిరుమలరావు ప్రభుత్వ అనుమతలకు పంపారు. రవాణాశాఖ మంత్రి సహకారంతో ముఖ్యమంత్రి ఆగస్టు 28న పదోన్నతులకు ఆమోదం తెలిపారు. అయితే ఇప్పటికీ జిఏడి విభాగం నుంచి జిఓ విడుదల కాకపోవడంతో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. వెంటనే జిఓ కోసం ఇ.యు రాష్ట్రకమిటీ రవాణామంత్రిని కలిసి విజ్ఞప్తి చేసింది.

సోమవారం అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని బోరెడ్డిగారిపల్లెలోని మంత్రివారి స్వగృహంలో యూనియన్ నాయకులు కలసి పదోన్నతులతో పాటు ప్రభుత్వ పరిధిలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని లేఖ అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్రకమిటీతో పాటు అన్నమయ్య జిల్లా గౌరవాధ్యక్షులు పి. నాగభూషణం రెడ్డి, జిల్లా కార్యదర్శి బి. చంద్రశేఖర్, జిల్లా కోశాధికారి కొండా ఈశ్వరరెడ్డి, రాయచోటి డిపో వర్కింగ్ అధ్యక్షుడు ఎ. ఆదినారాయణ, కోశాధికారి ఎం.ఆర్. రెడ్డి, రాజంపేట డిపో జాయింట్ సెక్రటరీ ఎస్‌. కె. వల్లి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News