ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి

ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయండి

పార్వతీపురం (జర్నలిస్ట్ ఫైల్) : అక్టోబర్ 7న విజయవాడలో జరగబోయే ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో పరిశీలకుడిగా హాజరైన ఏజీఎస్ గణపతి పిలుపునిచ్చారు. సోమవారం పార్వతీపురం ఎన్జీవో హోమ్‌లో ఫ్యాప్టో జిల్లా చైర్మన్ పి. కూర్మినాయుడు అధ్యక్షతన జరిగిన సభ్య సంఘాల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ప్రస్తుత కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగం, ఆర్థిక సమస్యల పరిష్కారం లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించామని, కానీ ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఈసారి రాష్ట్ర కేంద్రంలో పెద్దఎత్తున ధర్నా చేపడుతున్నామని గణపతి వెల్లడించారు.

సమావేశాన్ని ఉద్దేశించి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. మురళీమోహన్రావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక ఆర్థిక బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుండి తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ ధర్నాకు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా నిలవాలని సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. భాస్కరరావు, ఎపిటిఎఫ్ 257 జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. బాలకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News