పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ పునరుద్ధరణ
పోలీస్ సిబ్బందికి జిపిఎఐ బీమా పునరుద్ధరణ
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): పోలీస్ సిబ్బందికి పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ (జిపిఎఐ) పునరుద్ధరించబడింది. ఈ మేరకు ‘గుప్తా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్’తో ఒప్పందం కుదిరినట్లు డిజిపి హరీష్‌కుమార్ గుప్తా వెల్లడించారు.
కానిస్టేబుల్ నుంచి డిజిపి స్థాయి వరకు ప్రమాదవశాత్తు మరణించిన వారికి ర్యాంకు ఆధారంగా రూ.20 లక్షల నుంచి రూ.45 లక్షల వరకు, హోమ్‌గార్డులకు రూ.10 లక్షల వరకు బీమా సదుపాయం ఉండనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.7 కోట్లు 68 లక్షల 50 వేల రూపాయల చెక్కును గుప్తా న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కి అందజేశారు.
డిజిపి కార్యాలయం వెల్లడించిన ప్రకటన ప్రకారం, ఈ నగదు రహిత పాలసీ సెప్టెంబరు 29 నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుంది. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, వారిని ఆదుకుంటామని డిజిపి హరీష్‌కుమార్ గుప్తా స్పష్టం చేశారు.
ఈ బీమా పునరుద్ధరణ కార్యక్రమంలో ఐజిపి లా అండ్ ఆర్డర్ రవిప్రకాష్, భద్రత సెక్రటరీ హరికుమార్ (రిటైర్డు ఐపిఎస్), గుప్తా న్యూ ఇండియా అస్యూరెన్స్ సిఇఒ రాజన్ పాల్గొన్నారు.