గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్): గుంటూరు జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు కొరిటిపాడు పార్క్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని), బీజేపీ సీనియర్ నాయకుడు జూపూడి రంగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భారతమాత, గాంధీజీ, శాస్త్రిజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు పాదాభిషేకం చేసి కొత్త వస్త్రాలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై ఎగ్జిబిషన్, గో ఆధారిత ఉత్పత్తుల స్టాల్స్, ఖాదీ సంతను ఏర్పాటు చేశారు. మేయర్ రవీంద్ర, జూపూడి రంగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

జూపూడి రంగరాజు మాట్లాడుతూ– "మోడీ 11 ఏళ్ల పాలనలో దేశం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందింది. అంత్యోదయ పథకాలతో చివరి పౌరుడికి సాయం అందుతోంది. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. స్వదేశీ ఉత్పత్తులు వినియోగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది" అన్నారు.

మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ– "మోడీ నిధుల మద్దతుతో రాష్ట్రానికి, నగరానికి ప్రాధాన్యత పెరిగింది. ఫ్లైఓవర్ పనులు వేగంగా మొదలయ్యాయి. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి" అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టొబాకో బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్, ఐటీ సెల్ కన్వీనర్ మకుటం శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాస్ రెడ్డి, శనక్కాయల అరుణ, జిల్లా సంయోజకుడు భీమినేని చంద్రశేఖర్, పాలపాటి రవి, వెలగలేటి గంగాధర్, కొత్తూరి వెంకట సుబ్బారావు, నేరళ్ళ మాధవరావు, పాండు రంగావిఠల్, టీవీ రావ్, చరక కుమార్ గౌడ్, డా. శనక్కాయల ఉమాశంకర్, బజరంగ్ రామకృష్ణ, దేసు సత్యన్నారాయణ, తోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News