ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి

 

  • నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలిగి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయుల ఆందోళనలను తీర్చడం అవసరమని వారు స్పష్టం చేశారు.

వినతిపత్రంలో ముఖ్యంగా డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో కరువు భత్యం మంజూరు చేయాలని కోరారు. కరోనా సమయంలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, పదోన్నతి సవరించిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

అంతేకాక, మున్సిపల్ ఉపాధ్యాయులకు పెన్‌షన్ ఫండ్ సౌకర్యం కల్పించడం, అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వడం, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పదోన్నతులు కల్పించడం కూడా వినతిపత్రంలో ప్రధాన డిమాండ్లుగా నిలిచాయి. డిఇఓ పూల్‌లో ఉన్న మున్సిపల్ లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులుకు కూడా స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులు ఇవ్వాలని కోరారు.

2022 మే నుండి ఆగిపోయిన ఎర్నింగ్స్ లీవ్ ఎంకాష్‌మెంట్ బిల్లులు మంజూరు చేయడం, వ్యాయామ ఉపాధ్యాయులకు క్రాష్ కోర్స్ ద్వారా ఫిజికల్ ఎడ్యుకేషన్ అర్హత కల్పించడం వంటి సమస్యల పరిష్కారం కోసం కూడా వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల కోసం ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించినందుకు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపారు.

వినతిపత్రం సమర్పణలో రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొనిగల హైమారావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జె. శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జయప్రకాశ్ నాయుడు, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు టి. వెంకట రమణ, విజయవాడ అర్బన్ ప్రధాన కార్యదర్శి చంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts

Latest News