ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం

ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత అవగాహన కార్యక్రమం

ఇప్పటం ( జర్నలిస్ట్ ఫైల్ ): నిర్మల ఫార్మసీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ మరియు ఉన్నత భారత అభియాన్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటం గ్రామంలో స్వచ్ఛత మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు గ్రామ ప్రజలకు పరిశుభ్రత అవసరం, చెత్త వేర్పాటు, ప్లాస్టిక్ వినియోగ నిర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

కళాశాల విద్యార్థులు ముందుగా గ్రామ సచివాలయానికి చేరుకుని, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు సలహాల మేరకు పరిసరాల పరిశుభ్రత, తడి–పొడి చెత్త వేర్పాటు, ప్లాస్టిక్ వినియోగ తగ్గింపు వంటి అంశాలను ప్రజలకు వివరించారు. తరువాత విద్యార్థులు ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత సర్వే నిర్వహిస్తూ, గ్రామవాసులలో చైతన్యం సృష్టించారు.

తరువాత విద్యార్థులు ప్రాథమిక పాఠశాలకు చేరుకుని మానవహారంగా ఏర్పడి, స్వచ్ఛత ముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పరిశుభ్రతతో కూడిన నినాదాలు, స్లోగన్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ పాఠశాల విద్యార్థులకు పరిశుభ్రత ప్రాముఖ్యత వివరించారు. కార్యక్రమం చివరలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన “స్వచ్ఛత ప్రతిజ్ఞ”ని స్వయంగా చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రేవరెండ్ సిస్టర్ జి. నిర్మల జ్యోతి మరియు ప్రిన్సిపల్ డాక్టర్ బి. పాముల రెడ్డి అభినందించారు. కార్యక్రమానికి ఇదేవిధంగా ఇప్పటం గ్రామ సచివాలయం కార్యదర్శి నందం బాల పరమేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల సీనియర్ టీచర్ నల్లపాటి మధుబాబు, జాతీయ సేవా పథకం స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎం. బిందు ప్రియాంక, ఎస్.కే. రజియా బేగం, జి. ప్రజ్ఞ, ఎం. మధుమిత, పి. సాయి స్నిగ్ధ, ఎం.డి. హలీమా నౌరి, ఎం. హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటం గ్రామ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది, విద్యార్థుల చైతన్యం ప్రతిఫలించింది

About The Author

Latest News