ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి
- కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, రోషన్
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : ప్రజల కోసమే జీవించే ప్రజా నాయకుడు లేళ్ళ అప్పిరెడ్డి అని కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, షేక్ రోషన్ కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పని చేసే పేదల పెన్నిధిగా అభివర్ణించారు.
వైయస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య నేతృత్వంలో శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి జన్మదిన వారోత్సవాలు గుంటూరులో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విద్యార్ధి నేతలు అరుణ్, గోపి ఆధ్వర్యంలో బుధవారం సీతమ్మ కాలనీలో నిరుపేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కార్పొరేటర్లు పడాల సుబ్బారెడ్డి, షేక్ రోషన్ మాట్లాడుతూ, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నానని ముందుకొచ్చి వారి సమస్యను సొంత సమస్యగా భావించి, దాన్ని తన భుజస్కంథాలపై మోస్తూ.. వారికి అండదండగా నిలుస్తూ... వారిలో బ్రతుకు పట్ల కొండంత భరోసా నింపే అనితరసాధ్యుడు లేళ్ళ అప్పిరెడ్డి అని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను చిరునవ్వుతో ఎదుర్కొంటూ ఆయన ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కష్టపడి పనిచేసే వారిని గుర్తించి పైకి తేవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధి నేతలు వినోద్, గంటి, రవి, జగదీష్, బాజి, సాజిద్, రాజేష్, అజయ్, కరీం, కిరణ్, బాబి, తేజ, వీరాస్వామి, హోసన్న తదితరులు పాల్గొన్నారు.