మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు తెలిపిన బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్
గుంటూరు (జర్నలిస్ట్ ఫైల్) : ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టరుగా నియమితుడైన గంగాధర్, సచివాలయంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న గంగాధర్‌కు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన గౌరవమే ఈ నియామకం అని పేర్కొన్నారు. పార్టీ అభ్యున్నతే ధ్యేయంగా గంగాధర్ నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశారని ఆయన ప్రశంసించారు. బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అభివృద్ధి, పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు.
గంగాధర్‌కు మంత్రి సత్యకుమార్ అభినందనలు తెలుపుతూ భవిష్యత్ కార్యాచరణకు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రిని కలిసిన వారిలో బిజెపి రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ కన్వీనర్ పాలపాటి రవికుమార్, బిజెపి సీనియర్ నాయకులు ఈమని మాధవరెడ్డి, యువమోర్చా నాయకులు జంధ్యాల సాయి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.