ఉపాధ్యాయులను సన్మానించడం పూర్వజన్మ సుకృతం

ఉపాధ్యాయులను సన్మానించడం పూర్వజన్మ సుకృతం

చేబ్రోలు లో ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం 

ఆత్మీయ భావాలను పంచుకున్న విద్యార్థులు 

రాఘవేంద్ర ట్యుటోరియల్స్ 1994 బ్యాచ్ అపూర్వ కలయిక 

 

 ఉమ్మడి గుంటూరు జిల్లా బ్యూరో (జర్నలిస్ట్ ఫైల్) : మనం చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయి... నాడు ఎంతో కలిసిమెలిసి ఆటపాటతో చదువుకున్నాం... ఉపాధ్యాయులు మనల్ని ఎంతో ప్రయోజకులుగా తీర్చిదిద్దారు.. నేడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆ ఉపాధ్యాయులే కారణం.. వాళ్లు నేర్పిన విద్యాబుద్ధులు, మానవత్వ విలువలు.. తోటి వారికి సహాయ పడే తత్వం మాకు గుర్తుంది... అదే బాటలో పయనిస్తున్నాం.. భవిష్యత్తులో పయనిస్తూనే ఉంటాం... అంటూ పూర్వ విద్యార్థులు ఆదివారం చేబ్రోలులో కలిసి ఎంతో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.1993-94 సంవత్సరములో. తమకు చదువు చెప్పిన శ్రీ రాఘవేంద్ర ట్యుటోరియల్స్ అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. అంగరంగ వైభవంగా నభూతో నభవ్యతి అనే రీతిలో కన్నుల పండుగ నాటి ఉపాధ్యాయులు సత్కరించి. తమ రుణం ఇలా తీరిందంటూ ఆనంద ఉత్సాహాలతో ఉపాధ్యాయుల ఆశీర్వచనాలు అందుకున్నారు. మండల కేంద్రమైన చేబ్రోలు లోని సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఘనంగా ఈ సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాటి పాఠశాల కరస్పాండెంట్ గట్టుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ సన్మానం నిర్వహించడం తమ జీవితంలో మరచిపోలేని మధురానుభూతి అని అభివర్ణించారు.

మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న తల్లిదండ్రులను మరువకూడదని సూచించారు. మిమ్మల్ని నాడు చదివించడానికి మీ తల్లిదండ్రులు పడ్డ కష్టాలను వివరించారు. ఆడపిల్లలకు అత్తమామలు, తల్లిదండ్రులు ఇద్దరు రెండు కళ్ళతో సమానమని సూచించారు. మగ పిల్లలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తూ తల్లిదండ్రుల కంట కన్నీరు పెట్టకుండా ఆదరించాలని సూచించారు. మీకు ఎంత వయసు వచ్చినప్పటికీ తండ్రికి బిడ్డలా ఉపాధ్యాయుడికి శిష్యులే అనే విషయం గుర్తుంచుకోవాలన్నా రు. మీకు ఉన్న ఆదాయంలోనే సమాజ శ్రేయస్సుకు ఎంతోకొంత సహాయం చేయాలని సూచించారు. 1993-1994 విద్యా సంవత్సరంలో రాఘవేంద్ర ట్యుటోరియల్స్ లో చదువుకున్న బ్యాచ్ విద్యార్థుల్లో ఎంతోమంది ప్రయోజకులు కావటం తమకు గర్వంగా ఉందని గట్టుపల్లి చెప్పారు. మీరు మీ పిల్లల్ని చదివించి ఉన్నత విద్యావంతులతో పాటు మంచి విద్యాబుద్ధులు చెప్పించాలని సూచించారు. మరో ఉపాధ్యాయుడు రాఘవేంద్ర ఆ ట్యుటోరియల్ డైరెక్టర్ నజీర్ చాంద్ బాబు మాట్లాడుతూ మీ అందరి గ్రూపులో మమ్మల్ని ఉంచితే మాకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మీ పిల్లల్ని కూడా మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. వేజెండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పరాశరం శ్రీనివాసమూర్తి మాట్లాడుతుంది ఇంతమంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దిన మా జీవితం ధన్యమని చెప్పారు.

చదువుతోపాటు చక్కటి ఉన్నత విలువలు నేర్చుకున్నారని విద్యార్థులు ఆశీర్వదించారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే సత్ పౌరులకు మారటం మాకు గర్వకారణంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ బ్యాచ్ విద్యార్థులు గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. ఇక ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన పూర్వ విద్యార్థి అల్లం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో కాలం నుండి తమ గురువులను సత్కరించాలనే ఆలోచన, మా. కల ఇప్పటికీ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. తనతో పాటు చదువుకున్న బ్యాచ్ లో విద్యార్థునులు, విద్యార్థులు ఇప్పటికీ అన్యోన్యంగా ఉంటూ ఒక గ్రూపు క్రియేట్ చేసి చక్కటి భావాలను పంచుకుంటున్నామని చెప్పారు. తన జీవిత కాలంలో తాను చేసిన కొన్ని సేవా కార్యక్రమాలను సభలో పంచుకున్నారు. మనమందరం అన్నదమ్ములు, అక్కా చెల్లెలుగా కలిసిమెలిసి ఇలానే ఉండాలని సూచించారు. మరో విద్యార్థి ముసలా నాగరాజు మాట్లాడుతూ చదువులు వెనుకబడి ఉన్న తమకు చక్కటి విద్యార్థులు నేర్పించడంలో రాఘవేంద్ర ట్యుటోరియల్స్ ఉపాధ్యాయులు కృషి మరువలేమన్నారు. నాడు చదువులో వెనుకబడిన తమ బ్యాచ్ విద్యార్థులు మంచి విద్యావంతులుగా మారి నేడు ఈ స్థాయిలో ఉన్నారంటే రాఘవేంద్ర ట్యుటోరియల్ అధ్యాపకులే కారణమని చెప్పారు. మరో విద్యార్థి పొట్టి శ్రీనివాసరావు, మద్దాల అనిల్, రాజు, మాట్లాడుతూ నేడు తాము ఈ స్థాయిలో ఉన్నామంటే మా ఉపాధ్యాయులు నేర్పిన మానవతా విలువ, విద్యాబుద్ధులే కారణమని చెప్పారు, ప్రస్తుతం బెల్లంకొండ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న కోటిపల్లి  అరుణ జ్యోతి మాట్లాడుతూ రాఘవేంద్ర ట్యుటోరియల్స్ తాము నేర్చుకున్న విద్యార్థులే ఇప్పుడు నేను ఉపాధ్యాయురాలు కావడానికి దోహదపడ్డాయని చెప్పారు.

గత కొంతకాలం నుంచి నా మనసులో ఉన్న ఆలోచనను పంచుకుని ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యాయుల దీవెనలు, దివ్య ఆశీస్సులు ఉండటం వల్లే నేడు తాను తమ పిల్లలను క్రమశిక్షణగాపించి డాక్టర్లుగా తయారు చేసేందుకు ఎంబిబిఎస్ చదివిస్తున్నారు చెప్పారు. మా సహచర విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండటం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. మాకు చదువు నేర్పిన గురువులను సత్కరించడం పూర్వజన్మ సుకృతమని ఆమె చెప్పారు. మంచాల మాజీ సర్పంచ్ మండలి శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను ఈ ట్యుటోరియల్స్ లో చదివి చక్కటి విద్యను నేర్చుకున్నాను అన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయాలని తద్వారా పేద ప్రజలకు సేవలు అందించాలని రాఘవేంద్ర ట్యుటోరియల్స్ ఉపాధ్యాయులు తరచూ తనకు సూచించేవారని ఆయన చెప్పారు.

సన్మానం అనంతరం పూర్వ విద్యార్థులు చక్కటి విందు ఏర్పాటు చేశారు. అనంతరం విద్యార్థునులకు, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం లో మ్యూజికల్ చైర్స్, లెమన్ స్పూన్, తదితర పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన విద్యార్థులందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఒకరినొకరు ఆప్యాయతగా అన్యోన్యంగా పలకరించుకుని తమ కుటుంబ సంతోషాన్ని పంచుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, శివరామకృష్ణ, పొట్టి శ్రీనివాసరావు, జల్ది నాగరాజుతో పాటు పూర్వ విద్యార్థునులు అరుణ, రాజ్యలక్ష్మి, వాసవి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2025-09-28 at 18.29.50(1)
.

About The Author

Latest News