బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియకు ఆదేశం

గుంటూరు(జర్నలిస్ట్ ఫైల్) : గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ సంక్షేమ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రసారమైన కథనాలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించి వివరాలు ఆరా తీశారు. బీసీ బాలుర హాస్టల్ లో పదుల సంఖ్యలో  విద్యార్ధులకు అస్వస్థతకు గురవ్వడం బాధాకరమని పేర్కొన్నారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్ధులను  పరామర్శించి వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మంత్రి దుర్గేష్ ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. త్వరతగతిన విద్యార్థులు కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి సూచించారు.

About The Author

Latest News