గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సమస్యల పరిష్కారిస్తాం: డైరెక్టర్ ఎమ్.శివప్రసాద్
అమరావతి (జర్నలిస్ట్ ఫైల్): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంగళవారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంచాలకులు ఎమ్. శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయ జెఏసీ సభ్యులు తమ సమస్యలను పరిష్కరించడానికి ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించారు. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి పరిశీలించి, వాటి పరిష్కారానికి తనవంతు సహాయాన్ని అందిస్తానని ఎమ్. శివప్రసాద్ తెలిపారు.
ప్రభుత్వం తరఫున గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ విధులను హాజరై, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆయన అభ్యర్థించారు. ఎటువంటి సమస్య అయినా సమిష్టిగా చర్చించి పరిష్కరించుకోవచ్చని కూడా ఎమ్. శివప్రసాద్ వెల్లడించారు.