అఖిల భారత విద్యా హక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యులుగా జి.హృదయ రాజు
అమరావతి( జర్నలిస్ట్ ఫైల్) : అఖిల భారత విద్యా హక్కు వేదిక (All India Forum for Right To Education ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఏపిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయ రాజు ఎన్నిక కావడం జరిగిందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్.చిరంజీవి తెలిపారు.
అఖిల భారత విద్యా హక్కు వేదిక జాతీయ కౌన్సిల్ సమావేశాలు పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో గదర్ పార్టీ కాన్ఫరెన్స్ హల్ నందు అక్టోబర్ 10 నుండి 12 వరకు నిర్వహించబడ్డాయి. ఏఐఎఫ్ఆర్టీఈ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నుండి భాగస్వామ్య సంఘాలు ఏపీటీఎఫ్ నుండి రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయ రాజు ఎన్నికయ్యారు. అదేవిధంగా ఏపీ విద్యా పరిరక్షణ సమితి నుండి రాష్ట్ర కన్వీనర్ రమేష్ పట్నాయక్ జాతీయ అధ్యక్ష వర్గంలో అధ్యక్షులుగా , ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు కె.సుబ్బారెడ్డి, డిటిఎఫ్ నుండి ఎన్వి రమణయ్య, మహిళా కోటా నుండి జ్ఞాన ప్రసూన లు జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో విద్య పై అనేక తీర్మానాలు చేశారు. విద్య కేంద్రీకరణ , విద్యాలయాలలో మత తత్వ విధానాల ప్రవేశాన్ని అపాలని, విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని, తరగతులకు సిలబస్ తయారీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని, లోపభూయిష్టమైన జాతీయ విద్యా విధానంలో అనేక సవరణలు చేయాలని కోరారు. విద్యారంగ సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఏఐఎఫ్ఆర్టీఈ జాతీయ కౌన్సిల్ లో తీర్మానం చేసినట్లు తెలిపారు.