భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం

భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులపై TNUS హర్షం

అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : విజయదశమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 1209 మంది డీఈవో పూల్ లాంగ్వేజ్ పండితులుకి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్గా ప్రమోషన్ ఇచ్చిన సిఎస్సి మెమో నం. 14 విడుదలైంది. దీనిపై తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం (టిఎన్ యుఎస్) హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

గత ఆరు సంవత్సరాలుగా శాశ్వత స్థానాలు లేకపోవడంతో, ఒకచోట పని చేసి, మరొకచోట జీతం తీసుకుంటూ కష్టపడుతున్న భాషా పండితులు ఈ నిర్ణయం తర్వాత నిజమైన వెలుగును చూసారు. ఇటీవల గౌరవ హైకోర్టు వారి హక్కులను పరిగణలోకి తీసుకున్నప్పటికీ సమస్య పరిష్కారం కాకుండా ఉండటంతో టిఎన్ యుఎస్ సమస్యను టిడిపి ఎమ్మెల్సీలకు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లింది.

ఈ కృషి ఫలితంగా, భాషా పండితుల జీవితాల్లో విజయదశమి రోజున సంకల్పిత వెలుగు నింపింది. భాషా పండితులు టిఎన్ యుఎస్ కృషికి అభినందనలు తెలిపారు. టిఎన్ యుఎస్ అధ్యక్షులు మన్నం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రత్యేక ప్రకటనలో లోకేష్, టిడిపి ఎమ్మెల్సీలు, డైరెక్టర్ విజరామరాజుకు ధన్యవాదాలు తెలిపారు.

About The Author

Latest News