నూతన టీచర్ల కొరకు పిఆర్టియు డైరీ ఆవిష్కరణ

నూతన టీచర్ల కొరకు పిఆర్టియు డైరీ ఆవిష్కరణ

విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్) : మెగా డీఎస్సీ 2025 ద్వారా కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా,ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టటం పట్ల పిఆర్టియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నవాబ్ జానీ, సోల రాఘవ రాజు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం విజయవాడ ప్రతిభ కోచింగ్ సెంటర్ అధినేత జంపాన సుధాకర్ సౌజన్యంతో నూతన ఉపాధ్యాయ వృత్తి చేపట్టే అభ్యర్థుల కోసం 64 పేజీల లీవ్ రూల్స్, ముఖ్య జీవోలు మరియు ముఖ్య సమాచార సంపుటి  (హ్యాండ్ బుక్) ను  ఎన్టీఆర్ జిల్లా పిఆర్టియు ముఖ్య నాయకులతో  కలసి ఆవిష్కరించారు.

డీఎస్సీ 2025  నోటిఫికేషన్ ఇచ్చి ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేని విధంగా రికార్డ్ స్థాయిలో 150 రోజులలో  ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు ఈ సందర్భంగా పిఆర్టియు నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఇదే స్ఫూర్తితో పాఠశాలలలో భౌతిక వనరులకల్పన మరియు విద్యార్థుల సర్వ విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.ప్రతిభ కోచింగ్ సెంటర్ అధినేత జంపాల సుధాకర్ మాట్లాడుతూ ఈ డీఎస్సీ 2025 నందు మా ప్రతిభ కోచింగ్ సెంటర్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఎస్జిటి స్టేట్ సెకండ్ ర్యాంక్ ,పి.జి.టి సైన్స్ నందు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, పిజిటి గణితం  నందు స్టేట్ సెకండ్ ర్యాంకు తోపాటు ఎంతోమంది విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారని ఎంతోమంది విద్యార్థులు ఉపాధ్యాయ పరీక్షలు నందు ఉత్తీర్ణత పొందారని తెలిపారు.

 తదనంతరం మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ  నియామక పత్రాలు తీసుకొని పామర్రు లో ఇండక్షన్ ట్రైనింగ్ తీసుకుంటున్న  ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు 900 బుక్ లెట్ లు మరియు తిరువూరు వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ పొందుతున్న 250 మంది నూతన ఉపాధ్యాయులకు బుక్లెట్స్ అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిఆర్ టియు ముఖ్య నాయకులు కృష్ణాజిల్లా అధ్యక్షులు పెద్దిబోయిన శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి మనోహర్, ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి రాజశేఖర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఆవుల రాంబాబు,మర్రి ప్రభాకర్,రాష్ట్ర కార్యదర్శి బాబ్జి,జాన్ సునంద్, సతీష్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News