రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా సమగ్ర శిక్ష ఉద్యోగులు !

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా సమగ్ర శిక్ష ఉద్యోగులు !

-విజయవాడలో ఘనంగా “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ”

 

విజయవాడ (జర్నలిస్ట్ ఫైల్): విజయవాడలోని ఎంబీవికే విజ్ఞాన్ కేంద్రం, రాఘవయ్య పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో “దశాబ్ద ఐక్యత – భవిష్యత్తు పోరాట సభ” ఘనంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సభలో పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఏవి నాగేశ్వరరావు, చైర్మన్ బి. కాంతారావు, జనరల్ సెక్రటరీలు కళ్యాణి, రఫీ, మరియు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వరరావు హాజరయ్యారు.

సభలో నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మినిమమ్ టైం స్కేల్, హెచ్‌ఆర్ పాలసీ, సమ్మె అగ్రిమెంట్ అమలు విషయంలో నిర్లక్ష్యం చూపడం ఉద్యోగుల హక్కులకు హాని చేస్తోందని అన్నారు. పది సంవత్సరాలుగా సాగుతున్న ఉద్యమాల ద్వారా సాధించిన అగ్రిమెంట్ అమలు కాని పరిస్థితిని తీవ్రంగా ఆవేదనగా పేర్కొన్నారు.


నాయకులు ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్ చేసారు – కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంపు, ఈపీఎఫ్, గ్రాట్యూటీ, హెల్త్ స్కీమ్‌లు, ఖాళీల భర్తీ, ఉద్యోగ భద్రతకు చట్టబద్ధ హామీ వెంటనే అమలు చేయాలని కోరారు.


ప్రభుత్వం వెంటనే  మినిమమ్ టైం స్కేల్, హెచ్‌ఆర్  పాలసీ మరియు సమ్మె అగ్రిమెంట్ అమలు చేయకపోతే, డిసెంబర్ 10న “ఛలో ఎస్పీడీ” కార్యక్రమం నిర్వహించి, జనవరి నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె దిశగా కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు.

About The Author

Latest News