టీడీపీతోనే బీసీల అభ్యున్నతి

టీడీపీతోనే బీసీల అభ్యున్నతి

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి (జర్నలిస్ట్ ఫైల్) : తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు లభించిందని, రాజకీయ, ఆర్థిక, సామాజికంగా బీసీల అభ్యున్నతి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను నూతన ఎన్నికైన అమరావతి కురుమ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా శాఖ ప్రతినిధులు సోమవారం మర్యాపూర్వకంగా కలిశారు. పలు సమస్యల పరిష్కారానికి మంత్రికి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సవిత సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, వచ్చే ఆదరణ 3.0లో కురమలకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకాల అమలుకు శ్రీకారం చుడుతున్నామని, వాటిలోనూ కురమలకు ప్రాముఖ్యతనిస్తున్నట్లు తెలిపారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు సైతం బీసీల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. బీసీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక గుర్తింపు లభించింది టీడీపీ ప్రభుత్వాల హయాంలోనేనన్నారు. బీసీలను జగన్ అణచివేస్తే, సీఎం చంద్రబాబు భుజాన పెట్టుకున్నారని తెలిపారు. నూతనంగా ఎన్నికైన అమరావతి కురుమ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా శాఖ ప్రతినిధులను మంత్రి సవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో నూతన కురమ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షుడు మర్రి వెంకట సత్యనారాయణను, ఉపాధ్యక్షుడు బక్కా ఉమమాహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బి.రామకృష్ణ, ట్రెజరర్ కేవీ సత్యనారాయణ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అపార న‌ష్టం...ఆదుకోవాలి మీరు అపార న‌ష్టం...ఆదుకోవాలి మీరు
రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లింది రూ.901 కోట్ల త‌క్ష‌ణ సాయం చేయండి కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్ర ప్ర‌భుత్వం మొంథా తుపాను న‌ష్టంపై ఆర్టీజీఎస్‌లో ప‌వ‌ర్ పాయింట్...
కలసి పని చేద్దాం..ఆకాశమే హద్దుగా పర్యాటక అభివృద్ధి సాధిద్దాం
ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనంగా... 'ఎన్‌జీజిఓ సంఘం' గుంటూరు నగర శాఖ ఎన్నిక
సెలవు లేని ఉద్యోగం..తీరిక లేని డ్యూటీలు !
టీడీపీతోనే బీసీల అభ్యున్నతి
మొంథా తుపాను ముప్పు... 
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి