నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర

నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర

మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) విజయవాడలో సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ జయంతి సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “యూనిటీ మార్చ్‌ – జల సంగమ్‌ నుండి జన సంగమ్‌ వరకు” కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ నుండి విజయవాడకు చేరుకున్న బృందానికి నిర్మల కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ జాతీయ సేవా పథకం (ఎన్‌.ఎస్‌.ఎస్‌) వాలంటీర్లు పున్నమి ఘాట్‌ వద్ద జాతీయ పతాకాలతో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్‌.ఎస్‌.ఎస్‌ అధికారి ప్రొఫెసర్‌ మద్దినేని సుధాకర్‌ ముఖ్య అతిథిగా హాజరై, వాలంటీర్ల ఉత్సాహం, క్రమశిక్షణ, సేవాస్ఫూర్తిని అభినందించారు. కార్యక్రమాన్ని ఎన్‌.ఎస్‌.ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. రేఖా నరేష్‌ బాబు, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్‌ బి. అలేఖ్య సమన్వయం చేశారు.

స్టూడెంట్‌ కోఆర్డినేటర్లు పి. నివేదిత స్పూర్తి, ఎం. రవి, కె. హర్షవర్ధన్‌, చి. కార్తికేయ శ్రీరామ్‌, షేక్‌ అస్మా, అక్స‌ సాత్విక‌ తదితర విద్యార్థులు ఐక్య యాత్రకు ఆతిథ్యం అందించారు.

కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ రేవ్‌. సిస్టర్‌ జి. నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్‌ డా. బి. పాముల రెడ్డి వాలంటీర్ల సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి, ఏకతా భావాన్ని “ఏక భారత్‌ – ఆత్మనిర్భర్‌ భారత్‌” సంకల్పానికి ప్రతీకగా పేర్కొన్నారు.

About The Author

Latest News

మొంథా తుపాను ముప్పు...  మొంథా తుపాను ముప్పు... 
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది — రానున్న సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశంకాకినాడ సమీపంలో 28వ తేదీ సాయంత్రం తీరం దాటే సూచనలు అమరావతి  ( జర్నలిస్ట్...
 ‘మొంథా’ తుఫాన్ వస్తోంది... అప్రమత్తంగా ఉండండి
కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
నిర్మల ఫార్మసీ విద్యార్థుల ఘన స్వాగతం — “జల సంగమ్ నుండి జన సంగమ్ వరకు” ఏకతా యాత్ర
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
ఏపీ ఎన్జీజీవోస్‌ గుంటూరు సిటీ తాలూకా యూనిట్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ప్రెవేటు ట్రావెల్స్‌పై అరికట్టండి — ఆర్టీసీ సర్వీసులు దూరప్రాంతాలకు విస్తరించాలి