ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనంగా... 'ఎన్జీజిఓ సంఘం' గుంటూరు నగర శాఖ ఎన్నిక
ఎస్.పీ.ఎస్. సూరి అధ్యక్షుడు – సిహెచ్. కళ్యాణ్‌కుమార్ కార్యదర్శి
గుంటూరు నగర ఏపీఎన్జీ జిఓ సంఘం ఎన్నికలు సోమవారం నాడు ఉత్సాహభరిత వాతావరణంలో ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. నగరంలోని ఎన్జీవో కల్యాణ మండపంలో జరిగిన ఈ ఎన్నికల్లో సభ్యులు ఐక్యంగా వ్యవహరించడంతో ఏకగ్రీవ ఎన్నికల వాతావరణం నెలకొంది. నగర అధ్యక్షుడిగా ఎస్.పి.ఎస్. సూరి (వైద్య ఆరోగ్య శాఖ), కార్యదర్శిగా సిహెచ్. కళ్యాణ్‌కుమార్ (వాణిజ్య పన్నుల శాఖ), అసోసియేట్ అధ్యక్షురాలిగా డాక్టర్ వడ్లమూడి విజేత (ప్రొఫెసర్, గుంటూరు మెడికల్ కాలేజ్), కోశాధికారిగా కోటేశ్వరరావు (జిజిహెచ్) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె. చిన్నారావు, బి. సాంబశివరావు, ఎస్. రామకృష్ణారావు, పీవీ. భావనారాయణ ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలిగా బి. విజయలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎన్. రామకృష్ణారావు, సంయుక్త కార్యదర్శులుగా ఎం. శ్రీనివాసరావు, డి.వి. మురళీకృష్ణ, బి. దుర్గారావు, జి. పాండురంగారావు, బి. అంకమ్మరావు, మహిళా సంయుక్త కార్యదర్శిగా పి. సునీత బాధ్యతలు స్వీకరించారు.డీఈసీ సభ్యులుగా ఎం. శ్రీనివాసరావు, టీవీ. శ్రీనివాసరావు, ఎం. రత్నకుమారి, పీవీ. నారాయణమ్మ, ఎం. నాగపావని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికల అధికారిగా జిల్లా ఉపాధ్యక్షులు డి.డి. నాయక్, సహాయ ఎన్నికల అధికారిగా అమరావతి యూనిట్ అధ్యక్షులు అశోక్‌కుమార్ వ్యవహరించారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు ఉద్యోగులు భారీ సంఖ్యలో ర్యాలీగా వచ్చి ఎన్నికల కేంద్రాన్ని కిక్కిరిసేలా చేశారు.తరువాత నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, కార్యదర్శి శ్యాంసుందర్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగూరు షరీఫ్ పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఎన్నికల అధికారి డి.డి. నాయక్ నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీధర్ రెడ్డి, కృష్ణ కిషోర్, సయ్యద్ జానీబాషా, వెంకటరెడ్డి, విజయ్, తాలూకా సంఘ నాయకులు హనుమంతరావు, మణిరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘ ఐక్యతకు ప్రతీకగా మారిన ఈ ఎన్నికల్లో ఉత్సాహం, ఉల్లాసం మేళవించి ఉద్యోగులు ఆనందోత్సాహాలతో నిండిపోయారు.

