మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకావిష్కరణ
మంగళగిరి (జర్నలిస్ట్ ఫైల్) మంగళగిరి మండలం ఎర్రబాలెం పరిధిలో గల డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా "మంగళగిరి డాన్ బోస్కో స్కూల్" అనే పుస్తకాన్ని సలేషియన్ ప్రొవిన్షియల్ ఆఫ్ హైదరాబాద్ ఫాధర్ శాంటియాగు థామస్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి,పుస్తక రచయిత,ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఈపూరి రాజారత్నం రచన చేసిన మంగళగిరి డాన్ బోస్కో స్కూల్ పుస్తకంలో తెలుగు మీడియం పాఠశాల చరిత్ర, పాఠశాల వ్యవస్థాపకులు ఫాధర్ థామస్ చిన్నప్ప సేవలు,విద్యా భోదనలో ఉపాద్యాయులు అంకిత భావం వంటి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో రాశారు. ఈ పుస్తకాన్ని ఈ-బుక్స్ గా కూడా విడుదల చేశారు. పుస్తకం కావాలి అనుకున్నవారు ఏపీ న్యూస్ హంట్ డాట్ కామ్ తెలుగు వెబ్సైట్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని పుస్తక రచయిత ఈపూరి రాజారత్నం తెలిపారు.ఈ కార్యక్రమంలో 91-92 బ్యాచ్ విద్యార్థులు, విద్యార్థినీలు,పూర్వ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

