మార్కెట్ యార్డులో రూ.37.70 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మార్కెట్ యార్డులో రూ.37.70 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మంత్రి స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కూటమి ప్రభుత్వం ప్రజలు, రైతులు సంక్షేమానికి కట్టుబడి ఉంది.

మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్

 మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) మంగళగిరి వ్యవసాయ మార్కెట్  యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.37 లక్షల 70 వేల విలువైన అభివృద్ధి పనులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ఈ నిధులతో మార్కెట్ యార్డులో అత్యవసర మరమ్మతులు, రైతు సదుపాయాల మెరుగుదలకు సంబంధించిన పలు పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ జవ్వాది కిరణ్  చంద్ మాట్లాడుతూ, చంద్రబాబు రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటు ప్రశంసనీయమని అన్నారు. మార్కెట్ యార్డులో  భవనాలు దెబ్బతినడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మంత్రి  మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించి ఈ నిధులను మంజూరు చేయడం రైతు సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం “కూటమీ ప్రభుత్వం – రైతుల ప్రభుత్వం”గా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని చైర్మన్ వివరించారు. ఆ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మార్కెట్ యార్డులో రూ.37.70 లక్షల విలువైన పనులు ప్రారంభించడం రైతులకు నేరుగా ఉపయోగకరమవుతుందని చెప్పారు. మార్కెట్ యార్డు పరిసరాల అభివృద్ధి, సౌకర్యాల విస్తరణ, భవనాల మరమ్మతులు వంటి పనులతో రైతులకు మెరుగైన వాతావరణం అందించగలమని తెలిపారు.


రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మరిన్ని సరికొత్త సదుపాయాలు, ఆధునికీకరణ  రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్‌ను ఆధునికీకరించేందుకు అన్ని విధాల కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.చర్యలు చేపట్టి, రైతులకు మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామని జవ్వాది కిరణ్ చంద్ వెల్లడించారు. మంగళగిరి సొసైటీ అధ్యక్షులు గాదె పిచ్చిరెడ్డి మాట్లాడుతూ  గతంలో టిడిపి ప్రభుత్వ హయాంలో మంగళగిరి మార్కెట్‌ అభివృద్ధి చేసిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తాజాగా టిడిపి ప్రభుత్వం అయామ్ లోనే  అదే జోష్‌తో మార్కెట్ యార్డ్ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని పేర్కొన్నారు.భవిష్యత్తులో కూడా మార్కెట్ యార్డ్‌కు మరిన్ని మౌలిక వసతులు, ముఖ్యంగా లింకు రోడ్ల అభివృద్ధి, సదుపాయాల విస్తరణ వంటి పనులు చందు  నాయకత్వంలో కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ యర్రగుంట్ల భాగ్య రావు, పాలకవర్గ సభ్యులు బైరబోయిన పద్మావతి, మేడిశెట్టి కిషోర్, ఎన్  విజయ కుమార్ రెడ్డి, వల్లభాపురం స్వర్ణకుమారి, భైరబోయిన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెన్షన్–జిపిఎఫ్ సేవలు డిజిటల్ దిశగా – ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ కీలక చర్చలు పెన్షన్–జిపిఎఫ్ సేవలు డిజిటల్ దిశగా – ఉద్యోగ సంఘాలతో ఆర్థిక శాఖ కీలక చర్చలు
పెన్షన్ మరియు జిపిఎఫ్ అప్లికేషన్లో సరళతరం మరియు డిజిటలైజేషన్ ను ఆహ్వానిస్తున్నాం.. ఉద్యోగుల తరుపున పలు సూచనలు చేశాం.. ఏపీ జెఎసి చైర్మన్ ఏపీ ఎన్జీజివో  సంఘ...
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తెనాలిలో గ్రాండ్ ఓపెనింగ్    
విజ్ఞాన్స్‌ వర్సిటీ – ఇప్సైటీ డయాగ్నస్టిక్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌ల మధ్య అవగాహన ఒప్పందం
మార్కెట్ యార్డులో రూ.37.70 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ప్రకృతి వ్యవసాయం... ఆరోగ్యానికి ఆహ్వానం
అపార న‌ష్టం...ఆదుకోవాలి మీరు
కలసి పని చేద్దాం..ఆకాశమే హద్దుగా పర్యాటక అభివృద్ధి సాధిద్దాం