కాంతార నటుడు రాకేష్ అకాలమరణం… కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం

కాంతార నటుడు రాకేష్ అకాలమరణం… కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం

బెంగళూరు: కన్నడ సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచిన వార్త సోమవారం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాంతార: చాప్టర్ 1 సినిమాలో నటించిన రాకేష్ పూజారి(33) హఠాన్మరణం చెందాడు. గుండెపోటు కారణంగా అతడు ప్రాణాలు కోల్పోవటం సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.

రాకేష్ ఆదివారం రాత్రి ఉడిపిలో జరిగిన ఓ మెహందీ ఫంక్షన్‌కు హాజరయ్యాడు. మిత్రులతో కలిసి సరదాగా గడుపుతూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా అతడికి అస్వస్థత వచ్చింది. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని సమీప ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కార్డియాక్ అరెస్ట్‌ కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

ఈ ఘటనపై కర్కాలా టౌన్ పోలీసులు అసహజ మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాకేష్‌ అకాలమరణంతో కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదచాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు తీవ్ర శోకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇడియట్ సినిమాతో గుర్తింపు పొందిన నటి రక్షిత రాకేష్ మరణంపై ఎమోషనల్ పోస్టు చేశారు. సోమవారం సాయంత్రం రాకేష్ ఇంటికి వెళ్లి ఆయన భౌతిక దేహానికి నివాళులు అర్పించారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని