ఖాజీల సమస్యల పరిష్కారానికి కృషి : ఎమ్మెల్యే నసీర్
రాష్ట్రస్థాయి ఖాజీల అసోసియేషన్ విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే
గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో ఖాజీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గురువారం గుంటూరు ఆంధ్ర ముస్లిం కళాశాలలో రాష్ట్ర ఖాజీల విస్తృత సమావేశం నిర్వహించారు. ఏపీ మైనారిటీ వ్యవహారాల సలహాదారులు ఎస్ఎం షరీఫ్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ తో కలిసి ఎమ్మెల్యే నసీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లింల వివాహ సందర్భంగా ఖాజీలు ఇచ్చే వివాహాల ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం పలు విభాగాలు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెడ్ జోన్, గ్రీన్ జోన్ లుగా విభజించి, ఖాజీలు లేని ప్రాంతాల్లో నూతనంగా నియామకాలను ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైన చోట ప్రత్యేకంగా ఖాజీ బోర్డును కూడా ఏర్పాటు చేయడం ద్వారా ముస్లిం మైనార్టీల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు మార్గాలు సుగుమం అవుతాయని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ పై సమస్యలన్నిటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.