త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 

సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులు
రూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలు
లైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయం
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్

గుంటూరు ( జర్నలిస్ట్ ఫైల్ ) : గ్రంథాలయాలకు చేయూత విద్యాదానంతో సమానమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయానికి లైబ్రరీ ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుర్చీలు, ప్యాడ్లు, వాటర్ ప్యూరిఫైర్స్ ను శనివారం అందించారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే నసీర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లైబ్రరీ ఓల్డ్ ఫ్రెండ్స్ తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే తరానికి ఆదర్శంగా మారుతుందని తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయంలో చదువుకున్న అనేక మంది గొప్ప స్థాయిలో నిలిచారని చెప్పారు. ఇదే లైబ్రరీలో తాను కూడా చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. గతంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో కలిసి గ్రంథాలయాన్ని సందర్శించామని, సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఇదే లైబ్రరీలో లైబ్రేరియన్ గా విధులు నిర్వహించిన అచ్చమాంబ.. ఇదే గ్రంథాలయానికి సేవ చేయాలని రావడం అభినందనీయమన్నారు. గ్రంథాలయాలు ఇకపై పుస్తకాలకే పరిమితం కాకుండా డిజిటలైజేషన్ వైపు ప్రయత్నిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, సీఎస్ఆర్, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి రూ.8 కోట్లతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నామని చెప్పారు. లైబ్రరీని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వారంతా తమవంతుగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం గ్రంథాలయాలకు మహర్దశ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ప్రస్తుత యువత లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మురళి, పూల శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Latest News

త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్  త్వరలో రాష్ట్ర లైబ్రరీ డిజిటలైజేషన్ 
సీఎస్ఆర్ ఫండ్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముందడులురూ.8 కోట్లతో అభివృద్ధికి చర్యలులైబ్రరీకి ఓల్డ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ చేయూత అభినందనీయంగుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గుంటూరు (...
సచివాలయంలో ఆక్టోపస్ మాక్ డ్రిల్
గుంటూరులో 60 లక్షల విలువైన సెల్‌ఫోన్లు రికవరీ 
నగర ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి – కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశం
భారత్‌ భద్రతా త్రివిధ దళాలకు ఆధ్యాత్మిక సంఘీభావం తెలుపుదాం..
గుంటూరు ఛానల్ పనులు త్వరగా ప్రారంభించాలి
దేశ ప్రగతి టెక్నాలజీతోనే సాధ్యం: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని