హిందీ రుద్దే ప్రయత్నం వ్యతిరేకంగా మహారాష్ట్రలో భారీ నిరసనలు

హిందీ రుద్దే ప్రయత్నం వ్యతిరేకంగా మహారాష్ట్రలో భారీ నిరసనలు

మహారాష్ట్రలో త్రిభాషా విధానం పేరుతో హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ముఖ్యంగా 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరిగా బోధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జూలై 5న విస్తృత నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.

20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్–రాజ్ కలిసి...

'ఆవాజ్ మరాఠీచా' పేరిట శనివారం జరిగిన భారీ నిరసన ర్యాలీలో ఒక  క్షణం చోటు చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మరియు రాజ్ ఠాక్రే ఒక్క వేదికపై కనిపించడం విశేషం. ఈ ర్యాలీలో శివసేన (యుబిటి), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్‌ఎస్), ఇతర విపక్ష పార్టీలు మరియు వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

క్యాంపస్‌లో ఉద్రిక్తత – పోలీసులు అప్రమత్తం

ఈరోజు ఎన్‌ఎస్‌సీఐ క్యాంపస్‌లో నిర్వహించిన సమావేశానికి ఇరుపార్టీల మద్దతుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అడ్డంకులు లెక్కచేయకుండా మెయిన్ గేట్‌ను బద్దలుకొట్టి క్యాంపస్‌లోకి ప్రవేశించారు. దీనితో పోలీసులు అప్రమత్తమై మెయిన్ గేట్‌ను మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది: ప్రతిపక్షాల ఆగ్రహం

ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషలలోనే బోధన కొనసాగుతోంది. తాజాగా ప్రవేశపెట్టిన త్రిభాషా విధానం ద్వారా హిందీని తప్పనిసరిగా బోధించడం వల్ల విద్యార్థులపై అధిక భాషాభారంతో ఒత్తిడి పెరుగుతుందని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఈ విధానంతో భాషపై స్వేచ్ఛను హరించడం, ప్రాంతీయ భాషల పట్ల గౌరవాన్ని తగ్గించడమేనని వారు అభిప్రాయపడుతున్నారు.

జూలై 5 నిరసనల్లో పాల్గొన్న పార్టీలు

ఈ నిరసనలలో శివసేన (ఉద్ధవ్‌ వర్గం), ఎంఎన్‌ఎస్‌, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) తదితర ప్రతిపక్ష పార్టీలు చురుకుగా పాల్గొన్నాయి. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నట్లు నేతలు హెచ్చరించారు.

About The Author

Latest News

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...
ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది
మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం