మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
బాబు హామీలపై ప్రజల్లో అవగాహన పెంచాలని నేతల పిలుపు
మైదుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గ కార్యాలయంలో "నియోజకవర్గ సర్వసభ్య సమావేశం" మరియు "రీ కాల్ చంద్రబాబు" మేనిఫెస్టో కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు, రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ సలహాదారు సమ్బటూరు ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల్లో "బాబు షూరిటీ మోసం గ్యారంటీ" అనే చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా, ఇప్పటికీ ఒక్క హామీను కూడా అమలు చేయకపోవడాన్ని వారు విమర్శించారు. దాని బదులు వైఎస్సార్సీపీ నేతలపై, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం మాత్రమే కొనసాగుతోందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, పార్టీ మండలాధ్యక్షులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఇంచార్జీలు, కోఆప్షన్ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా “రీ కాల్ చంద్రబాబు” క్యాంపెయిన్‌లో భాగంగా క్యూఆర్ కోడ్‌ను కూడా ఆవిష్కరించారు, దీని ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా చంద్రబాబు పాలనపై తమ అభిప్రాయాన్ని నమోదు చేయవచ్చు.