హిమాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ విస్తృత వర్షాలు – ఇప్పటివరకు 69 మంది మృతి, రూ.500 కోట్లు నష్టం

హిమాచల్‌ ప్రదేశ్‌లో మళ్లీ విస్తృత వర్షాలు – ఇప్పటివరకు 69 మంది మృతి, రూ.500 కోట్లు నష్టం

హిమాచల్‌ ప్రదేశ్‌ను తీవ్ర వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం చోటుచేసుకుంది. ప్రాథమికంగా ప్రభుత్వం అంచనా వేసిన మేరకు రూ.500 కోట్ల మేర నష్టం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.

భారీ వర్షాలకు ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు

వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆకస్మిక వరదలు, గotekనుoలు, కొండచరియల విరిగిపడటంతో 40 మంది గల్లంతయ్యారు. ప్రధానంగా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 260కి పైగా రహదారులు మూసివేయబడ్డాయి.

వాతావరణ శాఖ హెచ్చరికలు – రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్‌లు

వర్షాలు మరింత ఉధృతంగా కురిసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని వాతావరణ శాఖ కాంగ్రా, సిర్మౌర్‌, మండి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అలాగే ఉనా, బిలాస్‌పూర్‌, హమీర్‌పూర్‌, చంబా, సోలన్‌, సిమ్లా, కులు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

ప్రజలకు హెచ్చరికలు – సహాయక బృందాలు అప్రమత్తం

ప్రభుత్వ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక మానిటరింగ్ నిర్వహిస్తోంది. పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్‌, పోలీస్‌, అగ్నిమాపక శాఖ బృందాలు రెడీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, పాత కట్టడాల్లో నివాసముంటే జాగ్రత్తలు పాటించాలంటూ సూచనలు చేశారు.

About The Author

Latest News

ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం ప్రత్తిపాడు మండలంలో బీజేపీ విస్తృతస్థాయి సమావేశం
ప్రత్తిపాడు, జూలై 5 (జర్నలిస్ట్ ఫైల్): భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండలంలో విస్తృత స్థాయి సమావేశం శనివారం మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి...
ఆపరేషన్ సిందూర్: బాజీరావు విగ్రహావిష్కరణలో మోడీ ప్రభుత్వం చారిత్రక సంకల్పానికి అమిత్ షా ఘనప్రశంస
అవయవ దాన ప్రచారానికి అంకితమైన సేవలకు కేంద్ర పురస్కారం – నాగార్జున చేతుల మీదుగా నరసింహారెడ్డికి గౌరవం
రాజధానిలో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ 
గ్రామాల్లో నెత్తుటి ఏర్లు పారించిన సంస్కృతి జగన్ రెడ్డిది
మైదుకూరులో "రీ కాల్ చంద్రబాబు" సభకు భారీ స్పందన
వంశీని పరామర్శించిన కొడాలి, పేర్ని – తెలప్రోలులో ముగ్గురు నేతల సన్నిహిత సమావేశం